మంత్రి గంటా - యార్లగడ్డకు కోర్టు నోటీసు

Update: 2019-02-09 09:53 GMT
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు - మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ పట్టణంలోని బీచ్ లో రోడ్డులో నందమూరి హరికృష్ణ - అక్కినేని నాగేశ్వర్ రావు - దాసరి నారాయణ రావుల విగ్రహాల ఏర్పాటుపై ఎవరి పర్మిషన్ తీసుకొని నిర్మిస్తున్నారో సంజాయిషీ ఇవ్వాలని కోర్టు నోటీసులో పేర్కొంది.

విశాఖ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా విశాఖ బీచ్ రోడ్డులో హరికృష్ణ - అక్కనేని నాగేశ్వర్ రావు - దాసరి నారాయణ రావుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటంపై జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ  హైక్టోర్లులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా విగ్రహాలు కోసం స్థలాన్ని ఆక్రమించడంపై కోర్టు వారికి సంజాయిషీ ఇవ్వాలని నోటీసులిచ్చింది.

ఇప్పటికే సుప్రీం కోర్టు ఇలాంటి విగ్రహాల ఏర్పాట్లపై మార్గదర్శకాలు జారీ చేసిందని హైకోర్టు పేర్కొంది. విగ్రహాల ఏర్పాటుకు స్థానిక సంస్థల పర్మిషన్ తప్పనిసరి చెప్పింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు - మాజీ ఎంపీ యార్లగడ్డ - పొన్నం మోహన్ సుప్రీం కోర్టు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని హైక్టోర్టు పేర్కొంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న విగ్రహాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో విగ్రహాల తొలగింపు ఓ రకంగా ఆ నేతలకు మైసస్ అవుతుందనే చర్చ జరుగుతుంది. కోర్టు ఆదేశాలపై ఆ నేతలు ఎలా ముందుకెళుతారో చూడాలి మరీ..
   

Tags:    

Similar News