గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై వేలాడే తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జి) కూలి అక్టోబర్ 26న 135 మంది అశువులు బాసిన సంగతి తెలిసిందే. 140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై బ్రిటిష్ వాళ్లు ఈ వంతెనను నిర్మించారు.
కాగా 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు మరమ్మతులు చేశారు. దాదాపు రూ.2 కోట్లతో ఏడు నెలలపాటు పనులు నిర్వహించారు. అక్టోబర్ 26న గుజరాత్ కొత్త సంవత్సరం కావడంతో ఆ వంతెనను తిరిగి ప్రారంభించారు. మొత్తం 400 మందికి పైగానే సందర్శకులు రాగా వేలాడే వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలింది. దీంతో వంతెన రెండుగా చీలిపోయింది. ఈ ఘటనలో 100 మీటర్ల ఎత్తు నుంచి అంతా మచ్చూ నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 135 కన్నుమూశారు.
కాగా మరమ్మతుల తర్వాత వంతెనకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని.. అందకుండానే దాన్ని ప్రారంభించినట్టు వెల్లడైంది. మరోవైపు గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై తాజాగా సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై మండిపడింది.
మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఎందుకు ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు.
ప్రభుత్వ విభాగమైన మోర్బీ మున్సిపాలిటీ.. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైన ఫలితంగానే 135 మంది మరణించారని మండిపడింది. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి జరిగిందా? అని నిలదీసింది.
మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు మండిపడింది. తెలివితేటలు చూపిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధ్రువీకరించకుండా అనుమతులిచ్చింది ఎవరని ప్రశ్నించింది. పూర్తి వివరాలను అందజేయాలని కోరింది. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.