ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం రూపంలో మరో చేదు వార్త ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ - ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజి నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కారెం శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా...ఛైర్మన్ గా కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. కారెం శివాజి నియామకంలో నిబంధనలు పాటించలేదని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా తిరిగి నియామక ప్రక్రియ చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎంకు హైకోర్టు రూపంలో ఎదురవుతున్న రెండో షాక్ గా ఈ పరిణామాన్ని పలువురు చెప్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ పై ఏపీ సర్కారు దూకుడుగా ముందుకు సాగుతుంటే...న్యాయస్థానం ఆ వేగానికి బ్రేకులు వేసింది. తాజా పరిణామంలో నియామకాన్నే చెల్లదని తీర్పు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ సర్కారును ఒకింత ఇరకాటంలో పడేసినట్లేనని చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/