మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య శిరీష ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు విచారణ చేపట్టింది. కొద్ది సేపటి క్రితం ఈ అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా శిరీష.. తన భర్తను కోర్టులో ప్రవేశపెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
దీంతో హైకోర్టు ఆమె వాదనతో ఏకీభవిస్తూ ఆర్కే ఆచూకీ తమకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్కే చనిపోయాడో పోలీసు కస్టడీలో ఉన్నాడో బయటపెట్టాలని ఆదేశించింది. అంతేకాదు... ఏదో జరిగిందని తమకు అనిపిస్తోందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్కే సజీవంగా ఉంటే ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకూడదని చెప్పింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. మావోయిస్టులైన, సామాన్యులైనా రక్షించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఏదో అయిందని తమకు అనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించడమంటే ప్రభుత్వంపై అపనమ్మకం వ్యక్తం చేయడం తప్ప ఇంకేమీ కాదు. దీంతో హైకోర్టు దృష్టిలో చంద్రబాబు ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/