దూకుడుగా నిర్ణయాలు తీసుకోవటం.. వాటిపై కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవటం తెలంగాణ సర్కారుకు ఒక అలవాటుగా మారింది. న్యాయ సంబంధమైన అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం అభాసుపాలు కావటం ఖాయం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. గత పదమూడు నెలల కాలంలో ఎన్నో అంశాల మీద కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి తరచూ చోటు చేసుకుంటున్నా.. సర్కారు ఈ అంశంపై దృష్టి సారించటం లేదన్న భావన వ్యక్తమవుతోంది. దీనికి తాజా ఘటనే మరో ఉదాహరణగా చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయన్న కారణంగా తెలంగాణ ట్రాన్స్ కోకు చెందిన 1252 మంది విద్యుత్తు ఉద్యోగుల్ని వారి విధుల నుంచి రిలీవ్ చేయటం తెలిసిందే. మరోవైపు వారికి.. ఏపీ సర్కారు ఎలాంటి పోస్టింగులు ఇవ్వని పరిస్థితి. దీంతో.. వారంతా హైకోర్టును ఆశ్రయించారు. స్థానికత ఆధారంగా 1252 మంది ఉద్యోగుల్ని గత నెలలో రిలీవ్ చేశారు. దీనిపై అప్పట్లో వారంతా హైకోర్టుకు వెళ్లగా.. స్టే విధించింది. అయినప్పటికీ వారిని విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ సర్కారు ససేమిరా అన్న పరిస్థితి.
మరోవైపు.. వారు తమకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర మంత్రులకు కూడా విన్నవించుకున్న పరిస్థితి. తమ మొరను విన్నప్పటికీ.. దానిపై చర్యలు తీసుకోకపోవటంతో వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. వారికి జూన్ నెల జీతాలు తక్షణమే ఇవ్వాలంటూ తెలంగాణ ట్రాన్స్ కో ను ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు జూలై 15కు వాయిదా వేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో రిలీవ్ చేసి మరీ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు (టీ ట్రాన్స్ కో) చిక్కుకుందన్న భావన వ్యక్తమవుతోంది.