2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు ....భూకబ్జాలు - ల్యాండ్ సెటిల్మెంట్లు - స్కామ్ లు - కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పై పలు ఆరోపణలు వచ్చాయి. పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు....ఉమపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని సబ్బరాయనగర్ వెంచర్ లో స్థలం ఇస్తామని కొందరు వ్యక్తులు రూ. 35 లక్షలు వసూలు చేశారని, వారంతా ఉమ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని నందిగామకు చెందిన నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. ఇక, విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని ఉమ కబ్జా చేయడం పై దుమారం రేగింది. తాజాగా, ఆ కేసులో బోండా ఉమకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బోండా ఉమ దంపతులతో సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీచేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన ఉమ.....తన పలుకుబడితో ఆ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఉమ కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరావు నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ భూ కబ్జా వ్యవహారంలో ఉమ బెదిరింపులకు పాల్పడతున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. రామిరెడ్డి ఫిర్యాదు చేసినా...పోలీసులు ఉమపై కేసు నమోదు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో, రామిరెడ్డి...ఈ వ్యవహారం పై హైకోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలోనే రామిరెడ్డి ఫిర్యాదు ప్రకారం ఎమ్మెల్యే బోండా దంపతులతో సహా 9 మందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు నేడు....విజయవాడ పోలీసులను ఆదేశించింది.