సండ్ర‌కు మ‌రో ఊర‌ట‌

Update: 2015-09-21 15:29 GMT
ఓటుకు నోటు కేసులో నిందితుడైన స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే టీటీడీపీ నేత సండ్ర వెంక‌ట వీర‌య్య మ‌రో ఊర‌ట ల‌భించింది. ఈ కేసుకు సంబంధించి మొద‌ట ఆయ‌న‌కు నోటీసు ఇవ్వ‌టం.. త‌ర్వాత ఆయ‌న క‌నిపించ‌కుండా పోవ‌టం.. చికిత్స పొందుతున్న‌ట్లు చెప్ప‌టం.. త‌ర్వాత విచార‌ణ‌కు హాజ‌రు కావ‌టం.. రిమాండ్ లో కొంత‌కాలం ఉండ‌టం.. అనంత‌రం ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ పొంద‌టం లాంటి విష‌యాలు తెలిసిన‌వే.

మంగ‌ళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ కు వ‌చ్చేందుకు కోర్టు అనుమ‌తి కోసం ఆయ‌న దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగేంత‌వ‌ర‌కూ హైద‌రాబాద్‌ లో ఉండొచ్చ‌ని చెప్పిన కోర్టు.. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత మాత్రం హైద‌రాబాద్‌ లో ఉండేందుకు వీల్లేద‌ని పేర్కొంది.

అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం హైద‌రాబాద్‌ లో ఉండేందుకు అనుమ‌తి ఇవ్వ‌ని హైకోర్టు.. హైద‌రాబాద్ త‌ప్పించి మ‌రెక్క‌డైనా ఉండొచ్చ‌ని వెల్ల‌డించింది. ఒక్క హైద‌రాబాద్ రావ‌టం మిన‌హా.. సండ్ర‌కు ఎక్క‌డికైనా వెళ్లే వీలు క‌ల్పించింద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News