ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టు నో

Update: 2015-12-09 09:37 GMT
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం (డిసెంబర్ 10) తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. బీఫ్ ఫెస్టివల్ విషయంపై కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

విశ్వవిద్యాలయాల్లో ఏ వర్గం మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించినా అంగీకరించమని స్పష్టం చేసిన హైకోర్టు.. బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టులు ఇచ్చిన ఆదేశాల్ని పోలీసులు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో.. గురువారం నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ వ్యవహారం ఇప్పుడు సందిగ్థంగా మారింది. నిజానికి కింది కోర్టు ఆదేశాలపై స్టే కోసం బీఫ్ ఫెస్టివల్ కార్యక్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇక్కడా వారికి చుక్కెదురు కావటంతో.. ఈ అంశంపై ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు.
Tags:    

Similar News