వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన రెడ్డిపై జరిగిన దాడి కేసులో ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా పలువురికి నోటిసులు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ డీజీపీ - తెలంగాణ డీజీపీ - కేంద్ర హం శాఖతో పాటు మొత్తం ఎనిమిది మందికి తాకీదులు అందాయి. తనపై దాడి జరిగిన తర్వాత జగన్ హైకోర్టు మెట్లు ఎక్కిన సంగతి విదితమే. అంతే కాదు రెండు వారాలలో తన వాదన వినిపించాలని తేల్చి చెప్పింది. దాడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పందించిన తీరు చాల ఆసక్తిదాయకంగా మారింది. దాడి జరిగిన వెంటనే ఎటువంటి విచారణ లేకుండ డీజీపీ స్పందించిన తీరు వివాదస్పదమైంది. దాడి జరిగిన వెంటనే కనీస విచారణ లేకుండా దాడి చేసిన వ్యక్తి కులం చెప్పటంతో పాటు - అతను జగన్ కు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అని తేల్చేసారు. ఒక రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మరో విధంగా స్పందించారు. ఈ దాడి జగన్ తల్లి - సోదారి చేయించారిని - తల తోక లేకుండా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడైతే అదంతా జగన్ ఆడుతున్న డ్రామా అని, జగన్ తనకు తానే ఆ దాడి చేయించుకున్నాడని అన్నారు. తాను రాజకీయాలలో దేశంలోనే సీనియర్ ని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు - రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడిపై ఈ స్దాయిలో స్పందించడం ఆయన బాధ్యతరాహితాన్ని గుర్తు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తాకీదులకు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తోరో చూడాలి. గరుడపురాణం పేరుతో దాడి జరుగుతుందని ముందుగానే జోస్యం చెప్పిన నటుడు శివాజీ తీరును కూడా హైకోర్టు పరిశీలిస్తోందని అంటున్నారు. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్ద తో విచారణ జరిపించాలని జగన్ పెట్టుకున్న పిటీషన్ ను హైకోర్టులో ఉంది. ఈ దాడిపై విచారణ జరుపుతున్న సిట్ కు కూడా కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ జరిపిన తర్వాత తన నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం నాయకుల పరిస్దితి మింగలేక కక్కలేక ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూద్దం.