ఆ కేసుల్లో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Update: 2021-11-06 04:59 GMT
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు షాకిచ్చేలా ఆదేశాల్ని జారీ చేసింది తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం. మద్యం సేవించి వాహనాల్ని నడిపే వారి వాహనాల్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. సంచలనంగా మారిన ఈ తీర్పుతో.. ఇంతకాలం తాగి వాహనాన్ని నడిపే వారి వాహనాల్ని సీజ్ చేస్తున్న పోలీసులు.. ఇకపై అలాంటి చర్యను తీసుకునే వెసులుబాటు ఉండదు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి వాహనాల్ని సీజ్ చేసే తీరును తప్ప పడుతూ.. హైకోర్టులో 40కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిగిన నేపథ్యంలో.. తాగి కారు నడిపిన వారి మీద కేసు నమోదు చేయొచ్చు కానీ.. వారి కారును పోలీసులు సీజ్ చేయకూడదంటూ సంచలన తీర్పును ఇచ్చింది. ఒకవేళ డ్రైవర్ తాగి పట్టుబడితే.. వారి వాహనాన్ని సదరు వాహన యజమాని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని.. వాహనాల్ని వారికి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పోలీసులు వాహనాన్ని తమ కస్టడీలోకి తీసుకోవచ్చని పేర్కొంది. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వాహనానికి సంబంధించిన ఆర్సీని చూపిస్తే.. ఆ వాహనాన్ని తిరిగి వాహన యజమానికి తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. అంతేకానీ వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవరికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారి వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News