ఇటీవల లాక్ డౌన్ తో హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులకు తెలంగాణ పోలీసులు పాసులు ఇచ్చి పంపించారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారందరినీ ఏపీ పోలీసులు ఆపు చేశారు. అలా రావడానికి వీల్లేదని.. తెలంగాణలోనే ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో ఈ పనిచేశారు. ఐసోలేషన్ లో ఉంటామన్న వారినే అనుమతించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై రాళ్లు రువ్వే వరకు సాగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు తాజాగా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఎన్.వోసీని సరిహద్దుల్లోనే పరిశీలించి ఆరోగ్యంగా ఉంటే ఏపీలోకి అనుమతించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్ కు తరలించాలని.. అంతేకానీ సరిహద్దుల్లో ఆపకూడదని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
క్వారంటైన్ అవసరం లేని వారిని గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని జగన్ సర్కారు హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఏపీకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం.. రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ తాజాగా ఏపీ హైకోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు ఏపీలోకి వెంటనే బేషరతుగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.