ధ‌ర‌ణికి మ‌ళ్లీ బ్రేక్.. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదుపై 10 వ‌ర‌కు స్టే!

Update: 2020-12-08 15:44 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `ధ‌ర‌ణి` పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత ఆస్తుల న‌మోదుపై రాష్ట్ర హైకోర్టు మ‌రోసారి స్టే విధించింది. ఇప్ప‌టికే ఒక‌సారి ఈ నెల 8వ తారీకు స్టే విధించిన కోర్టు.. తాజాగా ఈ గ‌డువును మ‌రోసారి పెంచింది. కేసీఆర్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మంగా ఈ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేతర భూముల వివ‌రాల‌ను ఆన్‌లైన్ చేయ‌డంతోపాటు.. అన్ని భూముల లావాదేవీల‌ను డిజిట‌లైజ్ చేయాల‌నే ఉద్దేశంతో భారీగా దీనిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ముఖ్యమంత్రి అనేక సంద‌ర్భాల్లో ఈ పోర్ట‌ల్ ప్రాధాన్యం వివ‌రించారు.

ఈ క్ర‌మంలోనే అక్టోబ‌రు 25న ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే మూడు జీవోల‌ను కూడా వెలువ‌రించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. న్యాయవాది గోపాల్‌శర్మ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ను ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అప్ లోడ్ చేయ‌డాన్ని ఏ చ‌ట్ట‌మూ అంగీక‌రించ‌బోద‌ని, అప్‌లోడ్ స‌మ‌యంలో చోటు చేసుకునే పొర‌పాట్ల‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ఈ క్ర‌మంలో దీనిపై తేల్చేందుకు హైకోర్టు.. తొలుత ఈ నెల 8వ‌ర‌కు ధ‌రణి పోర్ట‌ల్‌లో వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌పై స్టే విధించింది.

తాజాగా జ‌రిగిన వాద‌న‌ల్లోనూ పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది.. ప్ర‌భుత్వం సేక‌రించే వ్య‌వ‌సాయేత‌ర భూముల వివ‌రాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త ఉండ‌డం లేద‌ని, వ్య‌క్తిగ‌త ఆస్తులు, వివ‌రాలు, ఆధార్ వివ‌రాలు వంటివి సేక‌రించ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త వివ‌రాల గోప్య‌త‌కు భంగం వాటిల్లుతుంద‌ని దీనిని ఎవ‌రైనా త‌స్క‌రించేందుకు, మ‌రిన్ని వివాదాలు స్పష్టించేందుకు కూడా అవ‌కాశం ఉంద‌ని వాద‌న‌లు వినిపించారు. ప్ర‌భుత్వ త‌ర‌ఫు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్.. వాద‌న‌లు వినిపించారు. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తో రిజిస్ట్రేష‌న్లు ఆగిపోయాయ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో స్టే తొల‌గించాల‌న్నారు. అయితే.. ఏజీ వాద‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టిన హైకోర్టు.. పాత విధానంలోనే రిజిస్ట్రేష‌న్‌లు కొన‌సాగింవ‌చ్చ‌ని కోర్టు తెలిపింది. రిజిస్ట్రేష‌న్ల‌పై త‌మ ఉత్త‌ర్వులు ఎలాంటి ప్ర‌భావం చూపించ‌బోవ‌ని పేర్కొంది. అంతేకాదు, ప్ర‌బుత్వం సేక‌రించే వ్య‌వ‌సాయేత‌ర భూముల వివ‌రాల‌కు సంబందించి లేదా.. వ్య‌క్తుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌కు సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉండాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈక్ర‌మంలోనే దీనిపై 10వ తారీకు వ‌ర‌కు స్టే విధించింది.
Tags:    

Similar News