తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని - వారికి పాలనపై పట్టు లేదంటూ మాజీ సర్పంచ్ లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేయగా...మాజీ సర్పంచ్ లు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం...రాష్ట్రాంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ని కోర్టు కొట్టివేసింది. తద్వారా స్పెషల్ ఆఫీసర్ల రూపంలో ఎన్నికలకు వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడాలనే బాబు బ్యాచ్ ఎత్తుగడ విఫలం అయింది.
ఏపీలో దాదాపు 12వేల 880 గ్రామ పంచాయితీలు... లక్షా 30వేల 870 వార్డులు ఉన్నాయి. ఆగస్టులోనే సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో...ఏపీ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీవో జారీ చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే కోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో...ఓటర్ల జాబితాను సిద్దం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ప్రకటించడంపై పిటిషనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో అధికార టీడీపీ పాత్ర కీలకం. `మన పాలనతో 80-90% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా మనదే విజయం. అసలే ప్రతిపక్షం అవసరం ఏముంది?`` ఇది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు - ఆయన పుత్రుడు లోకేష్ సహా పచ్చ పార్టీ నేతల వ్యాఖ్యలు. కానీ, ఆచరణలో మాత్రం..అందుకు పూర్తి భిన్నం. స్పష్టంగా కనిపిస్తున్న టీడీపీ వ్యతిరేకతను అధిగమించలేకనే...పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోయారని, ఇందుకు రిజర్వేషన్లను సాకుగా చూపుతున్నారని ఇటు మాజీ సర్పంచ్‌లు మొదలుకొని అటు రాజకీయ విశ్లేషకుల వరకు చెప్పేమాట. తాజా తీర్పు నేపథ్యంలో కూడా ఇంకా అదే పాట పాడుతుండటం టీడీపీ ఎన్నికలకు ఎదుర్కునేందుకు సిద్ధంగా లేదనే విషయాన్ని చెప్పకనే చెప్తోందని అంటున్నారు.
ఇక ప్రధానప్రతిపక్షమైన వైసీపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పుంజుకుంటోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వారిలో మమేకం అవుతున్నారు. ఏ ఎన్నికకు అయినా సై అంటున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన పలు జాతీయ సర్వేల్లో వైసీపీ బలం స్పష్టమైన సంగతి తెలిసిందే. ఇటీవల దూకుడుగా స్పందిస్తున్న జనసేన ఈ ఎన్నికలకు తన సత్తాను తేల్చుకునేందుకు ఉన్న ప్రీ ఫైనల్‌గా భావిస్తోంది. అందుకే, హైకోర్టు తీర్పుపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామన్న జనసేన... మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, ఈ ఎన్నికల గెలుపు రాబోయే సార్వత్రికంపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపే అంశం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎన్నికలు జరిగితే అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో స్పష్టమవుతుంది. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. అయితే, పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలు కాబట్టి గెలుపోటములు ఆయా పార్టీలపై అనుకున్నంత ప్రభావం చూపించకపోవచ్చుననే మరోవాదన తెరమీదకు వస్తోంది. ఇప్పుడు ఏ పార్టీ మద్దతుతో గెలిచినా...అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు కప్పదాట్లకు సిద్ధమైపోతారని అంటున్నారు. గత ఎన్నికల అనంతరం సీఎం చంద్రబాబు ఈ తీరును విచ్చలవిడిగా ప్రోత్సహించిన తీరును ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.