ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చే ప్రజాప్రతినిధులకు సేవ తప్పించి మరో ఆలోచన ఉండకూడదు. అదేమిటో కానీ.. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారు.. తమ జీతాల కోసం పడే ఆరాటం చూస్తే.. ప్రజాసేవ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్దమనే వారి తీరు ఇదేనా? అన్న భావన కలుగక మానదు. ఇటీవల ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆమ్ ఆద్మీ తమ ఎమ్మెల్యేలకు జీతాల్ని పెంచేసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే.. తాజాగా పెరిగిన వారి జీతాల్ని చూసినప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల జీతాల కంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. కొత్త వేతన సవరణతో ఢిల్లీ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.90వేలుగా డిసైడ్ చేశారు. మరి.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల జీతాలు ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో దేశంలో ఎమ్మెల్యేల జీతాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదన్న అంశంపై శోధన మొదలైంది.
ఈ లెక్కల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. దేశంలో అత్యధికంగా జీతాలు ఉన్నది తెలంగాణ ఎమ్మెల్యేలకేనని చెబుతున్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతభత్యాలు దేశంలోనే ఎక్కువంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు రూ.2.5లక్షల వేతనం దక్కుతుంది. తెలంగాణ తర్వాత అత్యధికంగా ఎమ్మెల్యేల జీతాలు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలుస్తోంది.
అక్కడ ప్రతి ఎమ్మెల్యేకు నెలకురూ.2.33 లక్షల చొప్పపున వేతనంతో పాటు మిగిలిన వసతులు కల్పిస్తున్నారు. తర్వాతి స్థానంలో దేశంలోనే అతి పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నిలుస్తోంది. అక్కడ కూడా ఎమ్మెల్యేల జీతాలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. పేరుకు పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ పేద రాష్ట్రంగా అందరికి తెలిసిన యూపీలో ఎమ్మెల్యేలకు ప్రతి నెలా రూ.1.87లక్షల చొప్పున జీతం అందుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేని జమ్ముకశ్మీర్ లోని ఎమ్మెల్యేలకు నెలకు రూ.1.6లక్షల చొప్పున ఉంది.
దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలకు భిన్నంగా సోదర రాష్ట్రమైన ఏపీలో పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు నెల వారీ జీతం కింద రూ.1.3లక్షలు మాత్రమే దక్కుతోంది. ఇక.. అతి తక్కువగా ఎమ్మెల్యేల జీతాలు ఉన్న రాష్ట్రాల్ని చూస్తే.. హిమాచల్ ప్రదేశ్.. రాజస్థాన్ లో రూ.1.25 లక్షలు.. గోవాలో రూ.1.17 లక్షలు.. హర్యానా, పంజాబ్ లో రూ.1.15 లక్షల జీతాలు ఇస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణలో బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేసే ఎమ్మెల్యేల జీతాలు మాత్రం బంగారంగా చెప్పక తప్పదు.