హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారం తర్వాత దేశ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఢిల్లీలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం అంతా కామాంధులను శిక్షించాలని ఎలా నినందించిందో ఇప్పుడు దిశ సంఘటన తర్వాత కూడా ఒక్కసారిగా అందరూ కదిలి నిందితులను ఉరి తీయాలని నినందించారు. చివరకు దిశ నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. ఎన్ కౌంటర్ అయినంత మాత్రాన ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని అనుకోలేం.
అందుకే ఈ తరహా సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు అధికంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండన శిక్షగా విధిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం ద్వారా రేప్ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు. ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
- కేంద్రం తీసుకువచ్చిన నిర్భయ చట్టంలో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. మొత్తం నాలుగు నెలల్లోనే దర్యాప్తు - న్యాయ ప్రక్రియ ముగియాలి. ఇక దిశ చట్టంలో ఈ ప్రక్రియను నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదించారు. విచారణలో తిరుగులేని ఆధారాలు ఉంటే 14 రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తయ్యి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడాలి.
- కేవలం అత్యాచార సంఘటనల్లోనే కాకుండా పిల్లలపై జరిగే అత్యాచారాల శిక్షలు కూడా పెరిగాయి. కేంద్రం పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగీక దాడులు జరిగితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అలాగే ఉరిశిక్ష కూడ వేయవచ్చు.
- ఇక 14 రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి చేయడం అత్యాచారాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగీక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కూడా వర్తిస్తుంది. ఇదే కేసుల్లో కేంద్రం గడువు ఏకంగా యేడాది వరకు ఉంది.
- ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించినా - అసభ్య పోస్టులు పెట్టినా సరైన శిక్షలు లేవు. ఇక నుంచి ఇలా చేస్తే మొదటి తప్పుకు రెండేళ్లు - ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్ ను తీసుకు వచ్చారు.
- ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కానీ దేశ చరిత్రలోనే ఎక్కడా లేనట్టుగా ఇందుకోసం మహిళలు - పిల్లలపై నేరాల విచారణ ఆగకుండా కంటిన్యూ అయ్యేందుకు ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నారు.
అత్యాచారం - సామూహిక అత్యాచారం - యాసిడ్ దాడులు - సోషల్ మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు - పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు.
- ఇక నేరాలపై దోషులు హైకోర్టుకు వెళ్లే అప్పీలు గడువును కేంద్ర చట్టంలో 6 నెలలు ఉంటే.. అది దిశ చట్టంలో 3 నెలలకు తగ్గించారు.
- మహిళలు - పిల్లలపై నేరాలను స్పీడ్ గా విచారించేందుకు జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటుతో పాటు ప్రతి ప్రత్యేక కోర్టుకు - ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
- దిశలో ఏర్పాటు చేసిన డిజిటల్ రిజస్ట్రీ వల్ల ఈ తరహా నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు ప్రజలకు తెలుస్తాయి.
దిశ యాక్ట్ మొత్తం చదివితే ఇకపై ఎవ్వరూ మహిళలపై ఈ తరహా దాడులకు పాల్పడాలంటేనే భయపడడం ఖాయం. ఈ చట్టం సమాజంలో ఎంతో కొంత మార్పునకు ఉపయోపడేలా ఉంది.