హిల్లరీకి అలా దెబ్బ మీద దెబ్బ పడింది

Update: 2017-01-21 05:06 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటమే తడవు గెలుపు పక్కా అని ఫీలై..అందుకు తగ్గట్లే ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారు హిల్లరీ క్లింటన్. నిజానికి ఆమే కాదు.. యావత్ ప్రపంచం కూడా 45వ అమెరికా అధ్యక్ష పదవి పేరులో ఒక మహిళ పేరు ఉంటుందని నమ్మారు. అమెరికా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఒక మహిళా అధ్యక్షురాలు లేని కొరత ఈ దెబ్బతో తీరిపోతుందని భావించారు. కానీ.. అదేమీ జరగలేదు. ఇది ప్రపంచానికే షాక్ అయినప్పడు.. వ్యక్తిగతంగా హిల్లరీకి ఎంత ఉండాలి?

ఇదంతా ఒక ఎత్తు. చిన్న చిన్న విషయాల్లోనూ వరుస ఎదురుదెబ్బలు తగలటం హిల్లరీకి ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా హాజరైన హిల్లరీ క్లింటన్ ముఖం పదే పదే మాడిపోవటం గమనార్హం. దీనికి కారణం.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నారనే అంశంతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెల వస్త్రధారణ.. ట్రంప్ సతీమణి డిజైనర్ వేర్ కూడా కారణంగా చెబుతున్నారు.

ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానిని తనదైన శైలిలో తళతళలాడే వైట్ ఫ్యాంట్ వేసుకొని వచ్చారు హిల్లరీ క్లింటన్. కాసేపటికే ఆమె ఇద్దరు కుమార్తెలు ఆమె మాదిరే డ్రెస్సుల్ని వేసుకొని రావటం ఆమె ముఖం మాడిపోయింది. ఈ విషయాన్ని పాత్రికేయులు.. చుట్టూ ఉన్న వారితోపాటు.. కెమేరామెన్లు చాలా బాగా పసిగట్టారు. విపరీతమైన బాధ హిల్లరీ ముఖంలో కనిపించటంతో పాటు.. లేని ప్లాస్టిక్ నవ్వుల్ని ఆమె పూయించటాన్ని పలువురు గుర్తించటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే..అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు వచ్చిన ట్రంప్ సతీమణి మెలానియా కూడా హిల్లరీకి అవమానం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీకి డ్రెస్సుల్ని డిజైన్ చేసిన క్లోజ్ డిజైనర్  రాల్ఫ్ లారెన్.. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ట్రంప్ సతీమణికి డ్రెస్సుల్ని డిజైన్చేశారు.

బేబీ బ్లూ జాకెట్ వేసుకొని.. లాంగ్ డ్రెస్ లో మెలానియాను చూసిన వారంతా కళ్లు తిప్పుకోలేని పరిస్థితి. అమెరికా మాజీ అధ్యక్షుడు కెనడీ భార్య జాక్విలిన్ వేసుకున్న దుస్తుల తరహాలోనే మెలినియా వస్త్రాలు ఉన్నాయన్న మాట పలువురినోట వినిపించింది. సరికొత్త అమెరికా ఫస్ట్ లేడీ డ్రెస్సు హంగు ముందు.. హిల్లరీ వైట్ ఫ్యాంట్ సూట్ తేలిపోయింది. ఇన్ని బాధలు హిల్లరీని వేధిస్తుంటే.. ఆమె ముఖంలో నవ్వు వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది చెప్పండి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News