భారత్ - పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు యువతులు మూతీమూతీ రాసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్‌లో చేసిన ఈ ఫొటో షూట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అద్భుతమంటూ కీర్తించేవారు.. ఇదే పోయేంకాలం అంటూ విమర్శలు కురిపిస్తున్నవారూ ఉన్నారు.
పాకిస్తాన్ కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్ సుందాస్ మాలిక్ - భారత్ కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా ఈ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ లో చిరు జల్లులు పడుతుండగా పారదర్శక గొడుగులో ఈ ఇద్దరూ నవ్వుతూ - తుళ్లుతూ.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ తన్మయత్వ అధర చుంబనంలో ఉన్నట్టుగా ఈ ఫొటోలు తీశారు. వీటిని ‘ఏ న్యూయార్క్ లవ్ స్టోరీ’ పేరుతో ఫొటోగ్రాఫర్ సరోవర్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశాడు.
ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సుందాస్ మాలిక్ కూడా ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఫొటో షూట్ చాలా బాగుందని - హృదయానికి దగ్గర ఉందని చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెట్టారు. కొందరు మాత్రం ఇద్దరు అమ్మాయిలు ఇలా ఫొటోలు దిగడమేంటంటూ మండిపడుతున్నారు.