చరిత్ర తిరగబడుతోంది. హిందు సంస్క్రుతికి మచ్చపడుతోంది. హిందూ దేవుళ్లకు అగౌరవం జరుగుతోంది. హిందు దేవాలయాలు కూల్చబడుతున్నాయి. వందల సంవత్సరాల క్రితం కొన్ని మతత్తత్వ శక్తులు హిందు దేవాలయాలను ధ్వంస్వం చేసారని చదువుకున్నాము. ఈ అధునిక సమాజంలో కూడా అదే జరుగుతోంది. అమెరికాలోని లూయీస్‌విల్లీస్ పట్టణంలోని స్వామినారయణ దేవాలయం గోడలపై అపవిత్రమైన సందేశాలను రాసారని, కొన్ని గోడల అద్దలు కూడా పగలగొట్టారని పట్టణ మేయర్ గ్రెగ్ ఫిచ్చర్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దేవాలయానికి సంబంధించిన గోడలపైన ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం మధ్య గుర్తు తెలియని కొందరు దుండగులు రాయకూడని రాతలు రాసారని మేయర్ వెల్లడించారు.
దేవాలయంలోని గోడలపై నలుపు రంగు శిలువ గుర్తులను ముద్రించారని, జీసన్ మాత్రమే దేవుడు, జీసస్ అందరికీ దేవుడు, జీసస్ ఒక్కడే దేవుడు అనే అర్దం వచ్చేలా పలు నినాదాలను రాసారని పేర్కొన్నారు. దేవాలయ ముఖద్వారం వద్ద ఉన్న తలుపులను, గోడలను పగుల కొట్టడమే కాక, అక్కడ కూడా జీసస్ ఒక్కడే దేవుడు అనే అర్దం వచ్చేలా నినాదాలను రాసారని మేయర్ చెప్పారు. దేవాలయంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న కూర్చిలను, ఫర్నీచర్‌ను ధ్వంస్వం చేయడమే కాక ఓ కత్తి కూడా వదిలిపెట్టి వెళ్లారని వారు చెప్పారు. మరోవైపు లూయిస్‌విల్లి పట్టణ ఉన్నతాధికారి మాట్లాడుతూ 2012లో కూడా పట్టణంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని తాము సమర్దవంతంగా ఎదుర్కున్నామని తెలిపారు. అయితే ప్రస్తుత సంఘటన పట్ల తాము విచారణ వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అంతేకాదు పట్టణ పౌరుల రక్షణ బాధ్యతలు కూడా తమవేనని ఆయన భరోస్ ఇచ్చారు.