ఈ మూకుమ్మడి రాజీనామాల గోలేంది బాలయ్య?

Update: 2017-02-04 16:18 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడైన బాలయ్య సీన్లోకి వచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది. హిందుపురం అధికారపక్ష ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య.. తన వ్యవహారాల్ని చూసేందుకు శేఖర్ అనే వ్యక్తిని పీఏగా పెట్టుకున్నారు. సీఎం వియ్యంకుడికి పీఏగా వ్యవహరిస్తున్నారన్న ధీమాతో కావొచ్చు.. అతగాడి వైఖరి వివాదాస్పదం కావటమే కాదు.. నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

తాజాగా ఒక కాంట్రాక్ర్ బెదిరిస్తూ.. బండబూతులు తిట్టేసిన ఒక వీడియో బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఇప్పటికే తన పరిధి దాటి వ్యవహరించి.. ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న శేఖర్ తీరుపై హిందూపురం నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ తీరును అధినాయకత్వానికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఒకవైపు.. ఇదేమీ కాదు.. అతడి తీరుతో విసిగిపోయిన నేపథ్యంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తనపై నేతలు చేసే దాడికి కౌంటర్ అన్నట్లుగా పీఏ శేఖర్.. తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. తనపై వస్తున్న వరుస ఆరోపణల్ని శేఖర్ ఖండిస్తున్నారు. హిందుపురం ఇన్ ఛార్జ్ పదవి కోసమే తనను తప్పు పడుతున్నారని.. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆయన మండిపడుతున్నారు. ఒకవేళ అదే నిజమని భావిస్తే.. మరి.. కాంట్రాక్టర్ బెదిరిస్తూ.. బండబూతులు తిట్టేసే వీడియో మాటేమిటి? అన్న ప్రశ్నకు శేఖర్ మద్దతుదారులు సంతృప్తికర సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏమైనా.. ఇలాంటి వ్యవహారశైలితో అధికారపక్షానికి కొత్త సమస్యలు సృష్టిస్తున్న శేఖర్ తీరుపై బాలకృష్ణ ఒక చూపు చూస్తే వ్యవహారం మొత్తం సెట్ అయిపోతుందన్న మాట వినిపిస్తోంది.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News