బూస్ట్.. హార్లిక్స్ పేర్లు తెలియనోళ్లు దేశంలో తక్కువ మందే ఉంటారు. బలవర్థక పానీయంగా చెప్పే ఈ ఫేమస్ బ్రాండ్లు ఇప్పుడు వేరే వారి చేతికి మారిపోయాయి. జీఎస్ కే కన్జ్యూమ్స్ హెల్త్ కేర్ ను హిందూస్థాన్ యూనీ లీవర్ (హెచ్ యూఎల్) కంపెనీలోకి విలీనం చేయటానికి తాజాగా అనుమతి లభించింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్ యూఎల్ లోకి విలీనం చేస్తున్నారు. ఇంతకీ హెచ్ యూఎల్ అంటే ఏమిటంటారా? రిన్.. సర్ఫ్.. లక్స్.. రెక్సోనా.. డోవ్.. మొదలుకొని అన్నపూర్ణ ఆటా.. కిసాన్.. డాల్డా..క్లోజప్ ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం మనం వాడే వస్తువుల్లో తక్కువలో తక్కువ పాతిక శాతం సదరు కంపెనీవే.
అలాంటి కంపెనీ తాజాగా బూస్ట్.. హార్లిక్స్ తో పాటు.. మరికొన్ని బ్రాండ్లను తన సొంతం చేసుకుంది. 2018లో ఆంగ్లో డచ్ కంపెనీ యూనీలీవర్ గ్లాక్స్ కోకు చెందిన ఆరోగ్య.. ఆహార విభాగాన్ని తనలో విలీనం చేసుకోనుంది. ఈ డీల్ లో భాగంగా ప్రముఖ బ్రాండ్లు యూనీలీవర్ భారతీయ విభాగం చేతికి వచ్చేశాయి. ప్రపంచ కన్ఫ్యూమర్ వ్యాపార ప్రపంచంలో ఈ డీల్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ డీల్ విలువ ఎంతో తెలుసా? రూ.27,750 కోట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతకంతకూ బలోపేతం అవుతున్న యూనీ లీవర్.. కన్జ్యూమర్ మార్కెట్లో తిరుగులేని బ్రాండ్ లీడర్ గా అవతరిస్తోందని చెప్పక తప్పదు.