ఒకప్పుడు పోర్న్ స్టార్ గా వెలుగు వెలిగి బాలీవుడ్ లో శృంగార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల సన్నీ నటించిన ‘మధుబన్ మే రాధికా నాచే’ ఆల్బమ్ వివాదాస్పదమైంది.
ఈ పాటలో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని.. లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి.
తాజాగా ఈ పాటపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం.. ఆమెను నర్తకిగా.. అరకొర బట్టలు వేసుకొని చూపిస్తే మేము బాధపడుతాం.. అందుకే ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయండి.. వారికి మూడు రోజుల సమయం ఇస్తున్నాం.. ఈలోపు ఆ వీడియోను డిలీట్ చేయకపోతే తీవ్రమైన చర్యలు చేపట్టాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మంత్రి వ్యాఖ్యలపై సన్నీ ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.