కరోనా నివారణకు హోమియో మందు తెచ్చిన కేంద్రం!
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడేది కరోనాపైనే.. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వినిపిస్తోంది. అమెరికా, భారత్ లలో శరవేగంగా విస్తరిస్తోంది. మందులేని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడం ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. మందు లేక.. వ్యాక్సిన్ లేక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. నివారణే లేని ఈ వ్యాధిని నయం చేస్తుందంటూ మార్కెట్లోకి ఎన్నో రకాల ఆయుర్వేద, హోమియో, ఇతర చెట్ల పసర్లు కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి.
తాజాగా కొన్ని ఆయుర్వేద సంస్థలు తమ లేహ్యాలు తింటే కరోనా రాదని.. తగ్గుతుందని కూడా మీడియాలో ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. కొంతలో కొంత ఊరటనిస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. కానీ కరోనా ను మాత్రం ఇవి కంట్రోల్ చేయవని వైద్య నిపుణులు అంటున్నారు.
అయితే తాజాగా కరోనా నివారణ కోసం కేంద్రం కూడా నడుం బిగించింది. భారత సనాతన ధర్మ శాస్త్రాల నుంచి వస్తున్న సంప్రదాయాలను మేళవించి హోమియోపతిలో ‘ఆర్సెనికం ఆల్బం-30’ మందును తీర్చిదిద్దింది.
కరోనాకు ‘ఆర్సెనికం ఆల్బం-30’ మందు బాగా పనిచేస్తోందని.. మంచి ఫలితాలను ఇస్తోందని కేంద్రీయ హోమియోపతి పరిశోధనా మండలి తాజా అధ్యయనంలో తేలింది.
7 రాష్ట్రాల్లోని కంటెయిన్ మెట్ జోన్లలో 22 వేల మందికి ఈ మందును ఇవ్వగా.. వీరిలో వైరస్ బారినపడిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. ‘ఆర్సెనికం ఆల్బం-30’ రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. దీనిపై ఆయూష్ శాఖకు నివేదిక ఇస్తామని కేంద్రీయ హోమియోపతి పరిశోధన మండలి పేర్కొంది.