వీడియో... సునీతా విలియమ్స్ కు డాల్ఫిన్స్ స్వాగతం!

అవును.... సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమికి చెరుకున్నారు. సుమారు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తో కలిసి సురక్షితంగా భూమిని చేరారు.;

Update: 2025-03-19 03:29 GMT

ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కాస్తా తొమ్మిది నెలల కఠిన పరీక్షగా మారిన తర్వాత వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు. మస్క్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ఈ వ్యోమగాములను ఇంటికి తిరిగి తీసుకువచ్చి ఫ్లోరిడా తీరంలో తెల్లవారుజామున 3:27 గంటలకు కిందకు దిగింది. ఈ సమయంలో డాల్ఫిన్స్ వెల్ కం చెప్పాయి.

అవును.... సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమికి చెరుకున్నారు. సుమారు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తో కలిసి సురక్షితంగా భూమిని చేరారు. తొలుత గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్.. గంటకు 116 మైళ్ల వేగానికి చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి.

అనంతరం 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. ఈ సమయంలో వ్యోమగాములకు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. అవి డ్రాగన్ క్యాప్సుల్ చుట్టూ ఈదుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తర్వాత వీరిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్ కు తీసుకెళ్లారు.

కాగా... గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక "స్టార్ లైనర్"లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి వీరు 8 రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే... స్టార్ లైనర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తడంతో వీరిద్దరూ లేకుండానే అది భూమికి తిరిగొచ్చేసింది.

అప్పటి నుంచి సునీత, విల్మోర్ లు అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఈ సమయంలో సుమారు తొమ్మిది నెలల తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో ఐ.ఎస్.ఎస్. నుంచి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ చేపట్టగా.. బుధవారం తెల్లవారుజామున క్రూ డ్రాగన్ ను భూవాతావరణంలోకి ప్రవేశపెట్టారు.

ఈ విధంగా సుమారు 9 నెలల తర్వాత క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగగా... వ్యోమగాములకు ముందుగా డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. ఈ క్యాప్సుల్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News