అమెరికాలో విమాన ప్రమాదంలో 12 మంది మృతి... ఎవరీ మార్టినేజ్!

తాజాగా అమెరికాలో హోండురాస్ లో 17 మందితో ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురై సముద్రంలో పడిపోయింది.;

Update: 2025-03-19 05:47 GMT

ఇటీవల అగరాజ్యంలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రన్ వేపై దిగేందుకు వస్తున్న పీఎస్ఏ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానాన్ని.. సైనిక హెలీకాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో ఏకంగా 67 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇదే సమయంలో.. ఇటీవల అల్సెస్కా నుంచి ఒక పైలెట్, 9 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైంది. అనంతరం సముద్రపు మంచు మీద విమానం శిథిలాలు కనిపించాయని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో... జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఒక విమానం కూలిపోయింది.


ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు వ్యక్తులు, నేలపై ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. ఇలా వరుస విమాన ప్రమాదాలు అగ్రరాజ్యాన్ని ఆందోళన పెడుతోన్న వేళ.. తాజాగా అమెరికాలో హోండురాస్ లో 17 మందితో ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురై సముద్రంలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.


అవును... అమెరికాలో రోటన్ ద్వీపం నుంచి లా సీబాకు వెళ్తోన్న విమానం హోండురాస్ తీరంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 15 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు ఉండగా.. వారిలో ఐదుగురిని జాలర్లు రక్షించారని చెబుతున్నారు. ఈ విమానం లాన్సా ఎయిర్ లైన్స్ కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు.

విమానం సరిగ్గా టేకాఫ్ కాలేకపోయిందని.. దీంతో అది సముద్రంలో పడిపోయిందని అధికారులు తెలిపారు. అయితే... ప్రమాదం జరిగిన చోటుకు సమీపంలో ఉన్న జాలర్లు ఐదుగురు విమాన ప్రయాణికులను రక్షించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయతిస్తున్నట్లు హోడురాస్ సివిల్ ఏరోనాటిక్స్ ఏజెన్సీ తెలిపింది.

ఎవరీ మార్టినేజ్..?:

ఈ విమాన ప్రమాదంలోని మృతుల్లో గరిఫునా సంగీతం ప్రాచుర్యానికి విశ్లేష కృషి చేసిన ఆరేలియో మార్టినేజ్ సువాజో కూడా ఉన్నారు. 1969లో హోండురాస్ లోని ప్లాప్లాయాలో జన్మించిన ఆరేలియో మార్టినేజ్.. 1990లో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో లాస్ గాటోస్ బ్రావోస్ అనే బ్యాండ్ కు ప్రాధాన గాయకునిగా మారారు.

ఆయన తొలి ఆల్బమ్ "గరిఫునా సోల్" అతనికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది. ఈయన రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారని చెబుతారు. ఈ తాజా విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారని స్థానిక మీడియా వెళ్లడించింది.

Full View
Tags:    

Similar News