మోడీ అడిగారు.. సునీతా విలియమ్స్ కుటుంబం ఓకే చేసింది

భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది.;

Update: 2025-03-19 05:09 GMT

ఎనిమిది రోజుల అంతరిక్ష పర్యటకు వెళ్లిన భారత సంతతికి వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోవటం.. తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె భూమిపైకి క్షేమంగా రావటం తెలిసిందే. ఆమెతో పాటు బుచ్ విల్మోర్.. మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమికి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది.

వీరి రాకను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయగా.. వీరి తిరుగు ప్రయాణం మీద యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి చేరటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె త్వరలో భారత్ కు రావాలని..ఆమెకు అతిధ్యం ఇచ్చేందుకు తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. సునీతా క్షేమంగా తిరిగిరావటంపై ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఆమె పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారన్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా.. స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965లో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో సునీత చిన్న కుమార్తె.

దీపక్ పాండ్యా గుజరాత్ లోనే జన్మించారు. 1983లో మాసాచుసెట్స్ లో హైస్కూల్.. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ.. 1995లో ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్ మెంట్ లో సునీత ఎమ్మెస్సీ పూూర్తి చేశారు. 1997లో మిలటరీలో చేరిన ఆమె.. 30 రకాల విమానాల్ని 3 వేల గంటల పాటు నడిపిన అనుభవం ఆమె సొంతం. 1998లో నాసా వ్యోమగామి అయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె త్వరలో భారత్ కు రానున్నట్లు చెప్పారు. అయితే.. సునీతా ఆరోగ్య అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే కనీసం మూడు నెలల వరకు బయలకు రాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండటంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. అవన్నీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత.. భారత్ లో పర్యటించే వీలుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News