సెల్ఫీ పిచ్చోళ్లపై వేటు పడింది. సమయం.. సందర్భం లేకుండా.. సెల్ఫీల మత్తులో పడిన తమ సిబ్బందిపై కామినేని వేటు వేసింది. నటుడు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను నార్కట్ పల్లి కామినేనికి హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
అయితే.. హరికృష్ణ పార్థిపదేహంతో ఆసుపత్రి సిబ్బంది కొందరు సెల్ఫీలు దిగిన వైనం సంచలనంగా మారి.. నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం వివాదాస్పదంగా మారి.. పలువురి ఆగ్రహానికి గురైంది.
ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన కామినేని ఆసుపత్రి యాజమాన్యం.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. తమ సిబ్బంది చేసిన తప్పిదం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని పేర్కొనటమే కాదు.. సిబ్బందిలో కొందరి అనాగరిక.. అమానుష ప్రవర్తన వల్లే ఇలాంటిది చోటు చేసుకుందని.. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించింది.
తమ సిబ్బంది చేసిన పని కారణంగా హరికృష్ణ కుటుంబ సభ్యులకు.. అభిమానులకు ఆసుపత్రి క్షమాపణలు కోరింది. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "మా కామినేని ఆసుపత్రులలో.. మేం మా రోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల్ని చాలా గోప్యంగా ఉంచుతాం. కానీ.. మా సిబ్బందిలో కొందరు చేసిన తప్పిదం కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది. ఇది మా ఆసుపత్రి యొక్క గోప్యతపై ప్రధాన దాడిగా మేం అర్థం చేసుకున్నాం. మా సిబ్బందిలో కొందరు అనాగరిక.. అమానుష ప్రవర్తన వల్ల ఈ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు కారణమైన వారిపై చర్యలకు సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఈ తప్పిదంలో పాల్గొన్న సిబ్బందిని మేం తగిన చర్యలు తీసుకొని తొలగించటం జరిగింది. ఇటువంటివి మళ్లీ జరగకుండా ఉండటానికి వీలుగా తగు చర్యలు తీసుకుంటాం. మా ఆసుపత్రిలో పని చేసే కొందరి తప్పిదంకు.. మా ఆసుపత్రి తరఫున హరికృష్ణగారికి ప్రియమైన వారికి.. అభిమానులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాం" అని పేర్కొన్నారు.