బీజేపీలో హాట్ టాపిక్‌.. ఈ లీకు వీరుడెవ‌రు...?

Update: 2021-11-22 04:36 GMT
ఏపీ బీజేపీలో కీల‌క విష‌యం ఆసక్తిగా మారింది. ఈ లీకు వీరుడెవ‌రు? అంటూ.. నాయ‌కుల మ‌ద్య గుస గుస వినిపిస్తోంది. ఎందుకంటే.. అత్యంత ర‌హ‌స్యంగా ఉండాల్సిన అంశాల‌ను కూడా.. కొన్ని మీడియా సంస్థ‌లు ముద్రించేస్తున్నాయి. ప్ర‌సారం కూడా చేసేస్తున్నాయి. దీని వెనుక ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎవ‌రో ఒక‌రు ప‌నిగ‌ట్టుకునిలీకు చేయ‌క‌పోతే.. ఆయా విష‌యాలు మీడియాకు తెలిసే అవ‌కాశం లేద‌ని.. నాయ‌కులే అంటున్నారు. సో.. దీనిని బ‌ట్టి తెర‌ వెనుక ఏదో జ‌రిగింద‌నే వాద‌న ఉంది. మొత్తానికి అత్యంత గోప్యంగా ఉంచాల్సిన విష‌యాలు కూడా ఇలా బ‌య‌ట‌కు రావ‌డాన్ని వారు సీరియ‌స్ గా నే భావిస్తున్నారు.

విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల అమిత్ షా..తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా.. ఆయ‌న ఇక్క‌డ షెడ్యూల్ ముగించుకుని.. చివ‌రిరోజు పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీ ప‌రిస్థితిని తెలుసుకున్నా రు. ఈ క్ర‌మంలోనే ఏ పార్టీతో ద‌గ్గ‌ర‌వ్వాలి..? ఏం చేయాలి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఎలాంటి వ్యూహాలు వేసుకో వాలి? వంటి కీల‌క అంశాల‌పై అత్యంత ర‌హ‌స్యంగా చ‌ర్చించారు. దీనికి మీడియాను కూడా ఎంట‌ర్ చేయ లేదు. అంతేకాదు.. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను ఏర్ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, టీడీపీతో ఎలా వ్య‌వ‌హ‌రించాలి. వైసీపీ తో ఎలా ఉండాలో కూడా చెప్పారు.

సో.. ఇవ‌న్నీ కూడా అత్యంత ర‌హ‌స్యంగా సాగిన వ్య‌వ‌హారాలే. అయితే.. వీటిలో కొన్ని ప్ర‌జ‌ల‌కు తెలియా ల్సిన అంశాల‌ పై.. రాష్ట్ర పార్టీ చీఫ్‌.. సోము వీర్రాజు ప్రెస్‌మీట్ పెట్టి.. మీడియాకు వివ‌రించాల‌ని అనుకు న్నార‌ట‌. అయితే.. అమిత్ షా వీరికి దిశానిర్దేశం చేసిన రోజు.. రాత్రం పొద్దుపోవ‌డం తో.. ఆయ‌న మీడియా ముందుకు రాలేదు. తెల్ల‌వారి మీడియా మీటింగ్ పెట్టాల‌ని అనుకున్నారు. కానీ, తెల్ల‌వారి చూసుకుంటే.. తాను చెప్పాల‌ని అనుకున్న‌ వాటితో పాటు.. అత్యంత కీల‌క‌మైన విష‌యాలు.. ర‌హ‌స్య సంభాష‌ణ‌ల తాలూకు మ‌ర్మాలు కూడా పేప‌ర్ల‌లో వ‌చ్చేశాయి. వీటిని తిరుప‌తి లోనే చూసిన‌.. సోము.. అవాక్క‌య్యార‌ట‌.
 
ఇదేంటి? అంటూ.. త‌నకు అత్యంత విశ్వాసుపాత్రుల‌కు ఫోన్‌లు చేసి.. నేను చెప్పాల‌నుకున్న విష‌యాలు వ‌చ్చాయి.. బాగానేఉంది. కానీ, చెప్ప‌కూడ‌ద‌ని అనుకున్న విష‌యాలు కూడా మీడియాకు ఎలా వ‌చ్చాయి. అది కూడా ఒక వ‌ర్గం మీడియాకు మాత్ర‌మే ఎందుకు వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించార‌ట‌. అయితే.. దీనిపై ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. ఎవ‌రో కీల‌క నాయ‌కుడు.. రాజ‌ధాని జిల్లాల‌కు చెందిన ఓ సామాజిక వ‌ర్గం నాయ‌కుడే కోవ‌ర్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే సంకేతాలు మాత్రం ఇచ్చారట‌. దీనిపై సోము చాలా ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని అమిత్ షాకు వివ‌రించార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News