హోటల్ 'ఫెయిర్మాంట్ బాన్ఫ్ స్ప్రింగ్స్' .. ఆ డెత్ మిస్టరీ వీడేదెలా ?

Update: 2021-07-19 13:30 GMT
ఎక్కడైనా మిస్టరీ ఉందంటే చాలు దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలగడం అనేది సర్వసాధారణం. ఇంకా మరి కొందరికైతే ఆ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకునేవరకు సరిగ్గా నిద్ర కూడా రాదు. ఇక ఈ భూ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు నేటికీ మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటిది ఈ డోర్లు మూసి చాలా ఏళ్లు అవుతున్నా, వాటిలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నా ఎవరూ వాటిని తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు. వాటిని తెరిస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో, ఎటునుండి ఏ ప్రళయం మీద పడుతుందో అనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. ఇంతకీ ఆ రూమ్ ఉన్న హోటల్ ఎక్కడ ఉంది అంటే అందమైన దేశమైన కెనడా లో ఉంది.

ఆ మిస్టరీ గురించి వివరాల్లోకి వెళ్తే .. కెనడాలో విదేశీయులను ఆకట్టుకోవడానికి , తమ దేశం టూరిజంను అభివృద్ధి చేయడానికి 1888 లో ఓ హోటల్ ను నిర్మించారు. ఈ హోటల్ బాన్ఫ్ నేషనల్ పార్క్‌‌ లోని ఓ పెద్ద కొండమీద నిర్మించారు. ఈ హోటల్ పేరు 'ఫెయిర్మాంట్ బాన్ఫ్ స్ప్రింగ్స్'. అయితే ఈ హోటల్ స్ప్రింగ్స్ హోటల్‌‌ గా ఫేమస్ అయ్యింది. ఈ హోటల్‌‌ లో బస చేసిన ప్రయాణికులు పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక హోటల్ కూడా బయటనుంచి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే , గత కొన్నేళ్లుగా ఏ శాస్త్రవేత్త కూడా ఛేదించలేని మిస్టరీ ఒకటి ఉంది. ఈ హోటల్‌‌లో దెయ్యాలున్నాయని ఇప్పటివరకు చాలా మంది చెప్పారు. పైగా కొందరు వాటి వల్ల ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు. అందుకే ఆ హోటల్‌‌లోని 8వ అంతస్తులో 873వ నెంబర్‌‌‌‌ రూమ్‌‌ని చాలాఏళ్ల నుంచి మూసి ఉంచుతున్నారు. ఆ రూమ్‌‌కి ఈ దెయ్యాలకు సంబంధం ఏంటంటే... దీని కథ తెలుసుకోవాల్సిందే.

1928లో ఒక జంట, ఇద్దరు పిల్లలతో ఈ హోటల్ లోని 873 రూమ్ లో బస చేశారు. ఆ ఫ్యామిలీ ఆ రోజంతా సంతోషంగా గడిపారు.. చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. రాత్రి ఆ రూమ్ లో నిద్రపోయారు.తెల్లవారి లేచి చూసేసరికి ఆ రూమ్ లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బతికి లేరు. దీనితో ఈ మరణాలపై దర్యాప్తు చేస్తే  హోటల్ లో దిగిన వ్యక్తి తన భార్యను, పిల్లలనుచంపి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎందుకు ఆలా చంపాడు అనేది ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని రోజుల పాటు ఆ రూమ్‌‌ ని మూసేశారు. కొన్నాళ్ల తర్వాత రూమ్ ను యధావిధిగా టూరిస్టులకు ఇచ్చారు. అయితే ఆ రూమ్ లో దిగిన ప్రతి ఒక్కరికీ ఏదొక సమస్య వచ్చింది. ఆ రూమ్ లో అర్ధరాత్రి సమయంలో అరుపులు వినిపించేవని, నిద్ర కూడా సరిగా పట్టెది కాదని, తమను తరిమి కొట్టినట్లు అనిపిస్తుందని 873 రూమ్ లో బస చేసిన పర్యాటకులు చెప్పారు.

దీనితో అక్కడ ఆ కుటుంబం దెయ్యాలుగా మారి నివాసం ఉంటున్నారని నమ్మకం అందరిలో బలపడింది. దీంతో ఆ హోటల్ లో ఆ రూమ్ ని క్లోజ్ చేయడమే కాకుండా రూమ్ నెంబర్ కూడా కనిపించకుండా స్టిక్కర్స్ వేశారు. నిజంగా ఆ రూమ్ లో దెయ్యాలున్నా లేవా అనేది ఇంకా మిస్టరీనే. ఇదే హోటల్ లో మరొక దారుణ ఘటన కూడా జరిగింది.. ఆ హోటల్ లో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఓ పెళ్లి కూతురు మెట్ల మీద నుంచి జారిపడిపోయింది. అప్పటి నుంచి ఆ ఫంక్షన్ హల లో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని అక్కడ పనిచేస్తున్నవారు చెబుతున్నారు. ఇన్ని దెయ్యాలు కథలున్నా ఈ హోటల్ కు ఆదరణ బాగానే ఉంటుంది. 
Tags:    

Similar News