ఫ్యూచ‌ర్లో వార్ అలా జ‌రుగుతుంద‌ట‌

Update: 2017-05-28 09:36 GMT
ఫ్యూచ‌ర్‌లో వార్ ఎలా ఉండ‌నుంది. యుద్ధ క్షేత్రంలో సైనికుల యుద్ధ విన్యాసాలు ఎలా ఉంటాయి? ఇలాంటి వాటికి స‌మాధానాలు చెప్పే వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు హాలీవుడ్‌.. కొన్ని బాలీవుడ్‌.. టాలీవుడ్ సినిమాల్లో చూపించే యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లే ఫ్యూచ‌ర్ లో వార్ ఉండ‌నుంద‌ని చెబుతున్నారు. మ‌రి ముఖ్యంగా యుద్ధంలో సైనికులు చెల‌రేగిపోయే తీరును క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపిస్తుందీ వీడియో.

హోవ‌ర్ బోర్డ్ గా పిలిచే వాటిని ఎక్కువ‌గా కామిక్ షోల‌లోనూ.. సూప‌ర్ హీరో ప్రోగ్రామ్స్‌లోనూ చూపిస్తుంటారు. నీళ్ల‌లోని నుంచి ఒక్క‌సారిగా ఆకాశానికి ఎగిరే హోప‌ర్ బోర్డులు రానున్న రోజుల్లో సైనికుల‌కు ఆయుధాలుగా మార‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కాలం సినిమాల్లో హీరోయిజం పండించేందుకు వాడిన హోవ‌ర్ బోర్డుల‌ను రానున్న‌రోజుల్లో సైనిక అవ‌స‌రాల కోసం వినియోగించ‌నున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వాటిని ఫ్రాంకీ జ‌ప‌ట అనే కంపెనీ ఇప్ప‌టికే అమెరికాకు త‌న ప్ర‌తిపాద‌న‌ల్ని పంపింది. గంట‌కు 93 ఏళ్ల స్పీడ్‌ తో దూసుకెళ్లే ఈ హోవ‌ర్ బోర్డులు గాల్లో ఎగురుతాయి. శ‌త్రువుల్ని మ‌ట్టుబెట్టేందుకు కీల‌క భూమిక పోసించే వీటిని సైనిక అవ‌స‌రాల కోసం స‌రికొత్త‌గా త‌యారు చేస్తామ‌ని స‌ద‌రు సంస్థ చెబుతోంది. అయితే.. దీనిపై చ‌ర్చ‌లు ఇప్ప‌టికి ప్రాధ‌మికంగానే ఉన్నాయ‌ని చెబుతున్నారు. హోవ‌ర్ బోర్డుల్ని సైనికులు వినియోగించ‌టం అంటే ర‌క్ష‌ణ రంగంలో స‌రికొత్త యుగానికి దారి తీసిన‌ట్లేన‌ని చెబుతున్నారు. తాజాగా ఫ్రాంకీ విడుద‌ల చేసిన వీడియోలో ఉన్న వ్య‌క్తి.. బీచ్ లో బోర్డు మీద  వేగంగా ఎగురుతూ ప‌లు విన్యాసాలు చేయ‌టం క‌నిపిస్తుంది. యుద్ధాల‌కే కాదు.. కౌంట‌ర్ టెర్ర‌రిజానికి చెక్ పెట్టేందుకు ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News