జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ హోం వర్కులో ఉన్నారు. గులాబీ బాస్ కు ఉన్న గుణం ఏమంటే.. తాను ఏదైనా అనుకుంటే దానికి సంబంధించిన అంశానికి సంబంధించి లోతుల్లోకి వెళ్లిపోతారు. అంతలా వర్కు చేసి కూడా కొన్నిసార్లు దానిని ఇట్టే వదిలేస్తారు. ఎందుకిలా? అంటే.. తనకు సూట్ కాదన్న భావన ఆయనకు కలిగితే.. అలాంటి తీరునే ప్రదర్శిస్తారని చెబుతారు. ఇదంతా ఎందుకంటే.. తనకు నచ్చిన వారిని మాత్రమే కాదు.. తనకు వ్యతిరేక రాజకీయ భావజాలం ఉన్న వారిని సైతం ఇట్టే ఆకర్షించే గుణం కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించే గుణంగా చెప్పాలి.
ఇదే ఆయనకు బలంగా చెప్పక తప్పదు. జాతీయరాజకీయాల మీద అవగాహన ఉన్న నేతగా తెలుగు రాష్ట్రాల్లో కాస్తంత సరుకు ఉన్న వారిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందువరుసలో నిలుస్తారు. మేధోపరమైన అంశాలతో పాటు.. కొన్ని భావోద్వేగ అంశాల విషయంలో ఆయన మాటలు కుండ బద్ధలు కొట్టినట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. దీనికి సంబంధించిన కేసు ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉండవల్లిని రాజ ప్రాసాదం లాంటి ప్రగతిభవన్ కు ఆహ్వానించిన వైనానికి ఉండవల్లి ఫిదా అయిపోయారు. దాదాపు మూడు గంటల పాటు వారి మధ్య సంభాషణను ఉండవల్లి చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన ఉండవల్లి.. ఇవాల్టి రోజున మోడీకి చెక్ పెట్టగల నేత కేసీఆర్ మాత్రమే అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఇంతలా కేసీఆర్ ను ఎందుకు పొగిడినట్లు? అన్నది అందరిలో ఆసక్తి రేపే అంశంగా చెప్పాలి.
నిజానికి ఉండవల్లి మాటల్ని జాగ్రత్తగా వింటే.. ఉండవల్లి ఎందుకు అంతలా పొగిడారో ఇట్టే అర్థమవుతుంది. ఉండవల్లి మాటల్లోనే చదివితే.. ''ప్రశ్నించే ప్రతిపక్షం బలంగా ఉండాలి. కానీ మోదీ దేశంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగి మాట్లాడితే వాళ్లమీద పాత కేసులు తిరగతోడి ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే కొత్త కేసులు పెట్టి నోరుమూయించే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక సీఎం తనకు దమ్ముందని మాట్లాడడం నచ్చింది. కేసీఆర్ వంటి మనిషి ఫోన్ చేసి ఒక సామాన్యుడైన నన్ను పిలిచారు. వెళ్లాను. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపాలన్న అజెండాలో ఆయన ఉన్నారు. ఈ దేశంలో ఎంత నీళ్లు ఉన్నాయి? ఎంత పవర్ జనరేషన్ ఉంది? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయాలపై చాలా హోంవర్కు చేశారు. వాటిని ఒక్కొక్కటి చెబుతూ నన్ను అడుగుతుంటే ఆశ్చర్యపోయా'' అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రగతిభవన్ కు రావాల్సి ఉంటుందన్న విషయాన్ని పది రోజుల ముందే చెప్పిన కేసీఆర్.. మూడు గంటల భేటీ తర్వాత.. త్వరలో తాను మళ్లీ పిలుస్తానని చెప్పిన తీరు చూస్తే.. ఎంతో జాగ్రత్తగా ఉండవల్లిని డీల్ చేయటంతో పాటు.. తాను అల్లాటప్పాగా రంగంలోకి దిగటం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన తీరు నచ్చినందనే చెప్పాలి. ఇదే.. కేసీఆర్ తో ఉండవల్లి లాంటి నేత కనెక్టు అయ్యారని చెప్పకతప్పదు.