ఎలా గెలుద్దాం.. వైసీపీలో ఇంకా గంద‌ర‌గోళ‌మే!

Update: 2023-01-15 10:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాలి. అది కూడా ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగిపోవాలి. 175/175 ద‌క్కించుకుని దేశం లోనే కాదు.. ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే ఒక‌రికార్డును తిర‌గ‌రాయాలి!ఇదీ..ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా పెట్టుకున్న ల‌క్ష్యం. దాదాపు ఏడాది కాలంగా ఈ పాట‌.. ఈ మాటే వినిపిస్తున్నా.. ఎక్క‌డా దీనికి సంబంధించిన క్లారిటీ మాత్రం పార్టీలో క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోండ‌ని నాయ‌కుల‌ను చ‌ర్నాకోల్ ప‌ట్టుకుని అదిలిస్తూ.. బెదిరిస్తూ.. ముందుకు న‌డిపిస్తు న్నారు. మ‌రోవైపు.. అప్పులు తీసుకువ‌చ్చైనా బ‌ట‌న్‌లు నొక్కేస్తున్నారు. ఇంకోవైపు అవ‌కాశం చిక్కిన‌ప్పుడ ల్లా.. విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు. అప్పుడ‌ప్పుడు.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను  కూడా ప్ర‌క‌టిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. వైసీపీలో ఇంకా గంద‌ర‌గోళం సాగుతూనే ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికీ.. అనుమానాల‌నే పెను భూతాలు వెంటాడుతూనే ఉన్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డ‌మే. సీఎంకు స‌ల‌హాదారుల‌కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు నాయ‌కుల‌కు మ‌ధ్య లేక‌పోవ‌డం.. ఇప్పుడు వైసీపీని ప‌లుచ‌న‌య్యేలా చేస్తోంది. దీంతో వైసీపీ ప‌రిస్థితి ఎక్క‌డిక‌క్క‌డ గంద‌ర‌గోళంగానే మారింది.

ఈ ప‌రిణామాల‌పై డేగ‌క‌న్నుతో వైసీపీ అధిష్టానం ప‌రిశీల‌న చేస్తున్నా.. కొంద‌రు నాయ‌కులు మాత్రం త‌మ‌కు తిరుగులేద‌నే దోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గుంటూరు, క‌ర్నూలు, అనంత‌పురం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, ప‌శ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో నాయ‌కులు త‌ర‌చుగా రోడ్డున ప‌డుతున్నారు.

వారిలో వారే విభేదించు కుంటున్నారు. ఇది ప్ర‌తిప‌క్షాల‌కు మేలు చేస్తుంద‌నేది పార్టీ అధిష్టానం ఆవేద‌న‌. కానీ, నాయ‌కులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. దీంతో వైసీపీలో గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News