ఆ బ్యాంక్ మాజీ ఎండీ ప్రేమాయణం బయటకొచ్చింది

Update: 2019-10-14 11:34 GMT
బ్యాంకుకుంభకోణం లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. విచారణను ముమ్మరం చేసిన వేళ.. ఒక బ్యాంక్ మాజీ ఎండీకి సంబంధించిన ప్రేమాయణమే కాదు.. రెండో పెళ్లి వ్యవహారం తాజాగా తెర మీదకు రావటం సంచలనంగా మారింది. పంజాబ్.. మహారాష్ట్ర సహకార బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన బ్యాంక్ ఎండీ జాయ్ థామస్ కు సంబంధించిన విస్మయకర విషయాలు వెలుగు చూశాయి.

క్రిస్టియన్ అయిన ఆయన కొన్నేళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన పేరును ఆయన జునైద్ గా మార్చేసుకున్నారు. దీనంతటికి మించి మరో కొత్త విషయాన్ని గుర్తించారు. బ్యాంక్ ఎండీగా పని చేసే రోజుల్లో తన పీఏతో ప్రేమాయణం నడిపిన ఆయన.. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. అప్పటికే పెళ్లై.. పిల్లలు ఉన్న థామస్ అలియాస్ జునైద్ రెండో పెళ్లికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మతం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవటమే కాదు.. తన ముద్దుల భార్యకు ఏకంగా తొమ్మిది ప్లాట్లను కట్టబెట్టినట్లుగా తేలిసింది. ఫూణెలోని ఈ ఫ్లాట్లతో వచ్చే అద్దెలతో ఆమె గడుపుతున్నారని.. సొంతంగా ఒక బొతిక్ నడుపుతున్నట్లుగా గుర్తించారు. రూ,4355 కోట్ల కుంభకోణంలో నిందితుడైన థామస్ రెండో భార్యకే కాదు మొదటి భార్యకు నాలుగు ఫ్లాట్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. రెండో పెళ్లి అనంతరం తన నివాసాన్ని ఆయన ఫూణెకు మార్చినట్లుగా గుర్తించారు. బ్యాంకులో జరిగిన కుంభకోణాన్ని శోధిస్తుంటే.. వ్యక్తిగత అంశాలు బయటకు రావటం.. అవన్నీ ఇప్పటివరకూ బయట ప్రపంచానికి తెలీకపోవటం ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News