భూకబ్జాలు.. చెరువుల్ని ఆక్రమించుకోవటాలు లాంటివి తెలంగాణకు కొత్తేం కాదు. ఉమ్మడి రాష్ట్రానికి మించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెలరేగిపోతూ.. ఎక్కడ భూమి కనిపిస్తేచాలు.. అక్కడ గద్దల్లా వాలిపోవటం చూస్తున్నాం. దీనికి సంబంధించిన బోలెడన్ని కథనాలు పలు మీడియా సంస్థల్లో వస్తున్నాయి. వాటి విషయంలో అటు ప్రభుత్వం కానీ.. .ఇటు అధికారులు కానీ పెద్దగా రియాక్టు కావటం కనిపించదు. ఆ మాటకు వస్తే.. భూకబ్జా అయినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్న ఉదంతాల్లోనూ అధికారుల్ని వివరణ అడిగినప్పుడు.. కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్నచందంలో స్పందించటం చూస్తామే కానీ.. ఓపెన్ కావటం కనిపించదు. ఆ మాటకు వస్తే.. అంత సాహసం చేసే అధికారులు తెలంగాణ వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించేంత మందే ఉన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు గ్రామస్తులు తమ భూముల్ని మంత్రి ఈటెల రాజేందర్ కబ్జా పెట్టినట్లుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాయటం.. ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి స్పందించటం.. ఆ వెంటనే అధికార పార్టీకి చెందిన టీవీ చానల్ లో ప్రత్యేక కథనంతో పాటు.. బ్రేకింగ్ న్యూస్ వేయటం చూస్తే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించట్లేదు. అంతేనా.. ఈ ఉదంతంపై అధికారులు పలువురు మాట్లాడుతున్న తీరు.. చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
పెద్దోళ్ల వ్యవహారంలో తాము తలదూర్చలేమని. మీడియా ముందుకు రావటానికి ససేమిరా అనే అధికారులకు భిన్నంగా.. ఈటెల ఎపిసోడ్ లో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్.. హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాలకు చెందిన వారు సీఎంకు లేఖ రాసి.. తమకు చెందిన దాదాపు వంద ఎకరాల అసైన్డ్ బూమిని ఈటెల.. ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు.
ఆ భూమిలో వారు ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమను పెట్టేందుకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు సాగిస్తున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు వెలుగు చూసిన కాసేపటికే.. అప్పటి అధికారి ధర్మారెడ్డి లైన్లోకి వచ్చేసి.. అప్పట్లో మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల్ని రెగ్యులరైజ్ చేయాలని తనకు చెప్పారని సంచలనంగా మరారు. అచ్చంపేట వద్ద మంత్రికి కోళ్ల ఫారాలు ఉన్నాయని.. వాటి కోసమే భూమిని రెగ్యులరైజ్ చేయాలని కోరారని చెప్పిన ధర్మారెడ్డి.. కలెక్టర్ స్థాయిలో భూముల్ని రెగ్యులరైజ్ చేయటం సాధ్యమయ్యే పని కాదని తాను చెప్పినట్లు చెప్పారు.
ధర్మారెడ్డి మాత్రమే కాదు.. మరో అధికారి కమ్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం విశేషం. పాతిక ఎకరాల భూమి ఇవ్వాలని తనను మంత్రి ఈటెల రాజేందర్ సంప్రదించారని.. తానువెళ్లి భూముల్ని పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధమని చెప్పినట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు అసైన్డ్ ల్యాండ్ ఇవ్వటం కుదరదని చెప్పినట్లు గుర్తు చేస్తూ.. ప్రస్తుతం ఆ భూమి ఈటెల అధీనంలో ఉందన్నారు.
ఇదంతా చూసినప్పుడు.. సాధారణంగా ఏ భూకబ్జా వ్యవహారం వెలుగు చూసిన సందర్భంలోనూ అధికారులు తమకు తాముగా ఓపెన్ కాలేదని.. ఒక మంత్రి మీద వచ్చిన ఆరోపణలపై ఇంతలా రియాక్టు కావటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది. ఈటెల ఎపిసోడ్ లో అధికారుల స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మరెన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయో చూడాలి.