కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు టీవీ ఛానళ్లు.. దినపత్రికలు.. వాట్సాప్ గ్రూపులు..సోషల్ మీడియా.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల కరోనా.. కరోనా నామ జపమే వినిపిస్తోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు మొదలు.. ఎవరిని కదిపినా ఈ వైరస్ గురించిన ముచ్చట్లే. ఇలాంటి పరిస్థితి మన దగ్గరే కాదు.. యావత్ ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితే.
ప్రస్తుతానికి 150కు పైగా దేశాల్లో ఈ పిశాచి వైరస్ వ్యాపించి ఉండటమే కాదు.. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. మందు లేని ఈ వైరస్ ను అంతమొందించటం ఎలా అన్న ప్రశ్న ఒకవైపు.. అప్రమత్త తో ఈ వైరస్ ను అడ్డుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ఎక్కడ ఎంతసేపు బతికి ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించ లేని బలహీనత ఈ వైరస్ సొంతం. ఈ కారణంతో ప్రపంచం ఇలా అయినా ఉంది. లేదంటే.. మరింత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండేవని చెప్పాలి.
గాల్లో ఎక్కువసేపు ఉండలేక.. వెంటనే ఏదో ఒక దాని మీద పడిపోవటం.. అక్కడ జీవించి ఉండటం ఈ వైరస్ విలక్షణత. కరోనా వైరస్ ను కొవిడ్ - 19గా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్ మీద అధ్యయనం చేస్తున్న వారు ఆశ్చర్యకరమైన అంశాల్ని వెల్లడిస్తున్నారు. కరోనా బారిన పడిన వ్యక్తుల నుంచి సేకరించిన వైరస్ ను ఇంట్లోనూ.. ఆసుపత్రుల్లోని ఉపరితలం మీదా ఉంచి.. అదెంత సేపు బతికి ఉంటుందని పరీక్షలు జరిపారు. ఇలా చేసిన టెస్టుల్లో తేలిందంటే.. ఈ మాయదారి వైరస్ గాల్లో మూడు గంటల పాటు బతికే ఉంటుందని తేల్చారు.
ప్లాస్టిక్.. స్టీల్ లాంటి వాటిపైన మూడు రోజుల పాటు బతికే ఛాన్సు ఉందని.. కార్డుబోర్డు మీద 24 గంటల పాటు ఉంటుందని తేల్చారు. అన్నింటికి మించి ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే.. రాగి మీద మాత్రం ఈ వైరస్ నాలుగు గంటల పాటు మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే.. రాగి మీద అంత తక్కువ సమయం మాత్రమే ఎందుకు మనగలుగుతున్నాయి? రాగి అంటే కరోనాకు ఎందుకంత ఇబ్బంది అన్న విషయం మీదా ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. ఇదంతా తెలుసుకున్నప్పుడు.. రోజువారీ జీవితం లో పలు వస్తువుల్ని తాకే ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవటం చాలా అవసరం. చేతి వేళ్లు.. ముఖానికి.. ముక్కుకు.. నోటికి.. కళ్లకు టచ్ కాకుండా చూసుకోవటం చాలా అవసరం. అదే కరోనా నుంచి కాపాడుతుందని చెప్పాలి.