2024 ఎన్నికల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఇంత మందికి సీట్లు లేవా?

Update: 2021-05-13 16:30 GMT
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది.  ఇందులో ముక్కు మొహం తెలియని వారు.. అధికారులు, చోటా మోటా నేతలు సైతం జగన్ గాలిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయారు. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీల్లో చాలామంది కొత్త వారు.. వివిధ రంగాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాంటి వారంతా జగన్ వేవ్ తో ప్రజాప్రతినిధులుగా మారిపోయారు. అయితే వచ్చేసారి వీరందరికీ వైసీపీలో టికెట్లు దక్కుతాయా? జగన్ ఇస్తాడా? వీరంతా గెలుస్తారా? అన్నది ఇక్కడ ప్రశ్న.

2019 ఎన్నికల్లో కనీస అర్హత లేని వాళ్లను కూడా జగన్ ఎమ్మెల్యేలను, మంత్రులను చేశాడనే అపవాదును మూటగట్టుకుంటున్నాడు. అయితే ఆ పదవులను చూసి ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ల దందా వాళ్లు చేస్తూ ఉన్నారంట.. హైకమాండ్ నుంచి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదట.. ఇంకా 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటామని.. మమ్మలను ఏమీ చేయలేరు కదా అని ధీమాతో ఉన్నారట..

అయితే తాజాగా ఒక వార్త వైసీపీ నుంచి లీక్ అయ్యిందట.. రాబోయే ఎన్నికల్లో 105 మందికి వైసీపీలో మళ్లీ సీట్లు దక్కే చాన్స్ లేదట.. వీళ్లంతా సీఎం ఆలోచనలను ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్లడం లేదని.. వాళ్ల స్వార్థం చూసుకొని పనిచేయడం లేదు అని తేలిందట.. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఆటోమేటిక్ గా బలోపేతం అయ్యింది కాబట్టి వాళ్లకు సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్లను తయారు చేసుకోవాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయ్యిందట..

ముఖ్యంగా ఈ విషయంలో జగన్ దూరదృష్టితో వెళుతున్నాడట.. చదువుకున్న వాళ్లు కావాలని.. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉండాలని అంటున్నారట.. పార్టీలో అప్పుడు వాళ్ల మీద వ్యతిరేకత ఉండదు కాబట్టి జగన్ వేవ్ మళ్లీ నడుస్తుందని వైసీపీ వర్గాలు ఆలోచన చేస్తున్నాయని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.  దీంతో ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేల్లో 105మందికి సీట్లు దక్కకపోతే ఆగమాగం కావడం ఖాయం. వారంతా ఏ పార్టీలో చేరుతారు? వారికి టీడీపీ టికెట్లు ఇస్తుందా? ఏం జరుగుతుందనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోందట..
Tags:    

Similar News