గంటా ని చంద్ర‌బాబు ఎలా ఒప్పించారు?

Update: 2019-03-11 14:00 GMT
గంటా రాజ‌కీయాల్లో బాగా సీనియ‌ర్ మాత్ర‌మే కాదు - అప‌జ‌యాలు లేని కెరీర్ కొన‌సాగించారు. సుమారు ఏడేళ్ల పాటు మంత్రిగా కీల‌క స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారు. పైగా కీల‌క మంత్రిప‌ద‌వులు గంటాకు ద‌క్కాయి. గంటాను ఎవ‌రూ క‌దిలించ‌లేరు అన్న స్థాయిలో ఉత్త‌రాంధ్ర‌లో టాక్ ఉంది. అయితే, వారం రోజులుగా ఆయ‌న కూసాలు క‌దులుతున్నాయి. గంటా సీటును లోకేష్ కొట్టేశారు. ఇక సీఎం సుపుత్రుడు గంటా మాత్రం ఎలా కాద‌న‌గ‌ల‌రు. ఒక ప్రాంతీయ పార్టీలో వార‌స‌త్వాన్ని ఎదిరించి నిల‌బ‌డే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా. అందుకే చేసేదేమీ లేక‌... ఆయ‌న స‌ర్దుకున్నారు. ఒక‌ర‌కంగా ఆయ‌న స‌మీప అనుచ‌రుల‌కు ఇది షాక్ ట్రీట్‌మెంట్‌. కాక‌పోతే పార్టీ లో నెం.2 కాబ‌ట్టి వాళ్లు స‌ర్దుకుపోగ‌ల‌రు కానీ గంటానే తీవ్రంగా మ‌ద‌న‌ప‌డుతున్నారు.

అయితే... కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన హామీలు ఇచ్చి చంద్ర‌బాబు గంటాను ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. గంటాకు మూడు పోర్టుల్లో ప‌లు కాంట్రాక్టులు ఉన్నాయి. ఇపుడు మోడీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింద‌ని, ఇపుడు తిరిగి మోడీ అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మే లేదు. ఈ నేప‌థ్యంలో నువ్వు ఎంపీగా పోటీ చేస్తే భ‌విష్య‌త్తు బాగుంటుంది. పైగా కాంగ్రెస్ కూట‌మి వ‌స్తే నీ హోదాను పెంచుతాను. మ‌న కోటాలో వ‌చ్చే మంత్రి ప‌ద‌వుల్లో నీకోటి ఇస్తాను. ఇది నీ వ్యాపార ప్ర‌గ‌తికి కూడా ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఆలోచించుకోమ‌ని చంద్ర‌బాబు గంటాకు న‌చ్చ‌జెప్పార‌ట‌. ఏకంగా పార్టీ అధినేత‌ ఆలోచించుకోమ‌ని అనడం అంటే ఒప్పుకోమ‌ని చెప్ప‌డ‌మే. చంద్ర‌బాబు చెప్పింది జ‌రిగితే నిజంగా గంటాకు అది బ్ర‌హ్మాండ‌మైన అవ‌కాశం కిందే లెక్క‌. కానీ ప‌రిస్థితులు దేశంలో అలా లేవు. మోడీ గ్రాఫ్ ప‌డిన మాట వాస్త‌వ‌మే గానీ సంకీర్ణంతో అయినా మోడీ ప్ర‌ధాని అవుతాడు అనే జ‌నం అంటున్నారు. లోక‌ల్‌గా ఏమో చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాడు... ఇట్లాంటి స‌మ‌యంలో ఎంపీగా గెలిచినా పెద్ద‌గా ఒరిగేదేంటి? అని గంటా ఆవేద‌న‌. అదే ఎమ్మెల్యే గా గెలిస్తే చంద్ర‌బాబు ఓడిపోయినా... పార్టీ మారితే భ‌విష్య‌త్తు ఉంటుంది. ఎంపీగా గెలిస్తే ఆ అవ‌కాశం కూడా ఉండ‌దు అన్న‌ది గంటా ఆవేద‌న‌. నిజ‌మే క‌దా మ‌రి!
Tags:    

Similar News