కీసర ఎమ్మార్వో నాగరాజు లంచావతరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 1.10 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు నాగరాజు పట్టుబడడం పెను సంచలనమైంది. ఏకంగా ఓ భూ వ్యవహారంలో కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసిన వైనం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఇప్పుడు ఏసీబీ అధికారుల తవ్వకాల్లో నాగరాజు అవినీతి బాగోతం కుప్పలు తెప్పలుగా బయటపడుతోంది. ఆయన అవినీతిపై బాధితులు ఒక్కరొక్కొరుగా బయటకు వస్తున్నారు.
తహసీల్దార్ నాగరాజు కేవలం సామాన్య ప్రజలనే కాదు.. ఈ భూదందాల్లో పోలీసు అధికారుల నుంచి కూడా లంచం డిమాండ్ చేసినట్లు తాజాగా విచారణలో తేలినట్లు సమాచారం. విశ్రాంత అదనపు ఎస్పీ సురేందర్ రెడ్డి సైతం తాజాగా మీడియా ముందుకు వచ్చి తన దగ్గర తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్నాడని తెలిపారు. పట్టాపాస్ పుసక్తకం ఇవ్వకుండా తనదగ్గర లంచం తీసుకున్నాడని తెలిపాడు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయాడు.