ఉప్పల్ స్టేడియం కొత్త రికార్డును నమోదు చేసింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జనసంద్రంగా మారింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కు భారీ ఎత్తున అభిమానులు హాజరు కావటంతో.. ఈ స్టేడియం మొత్తంగా నిండిపోయింది. రికార్డుస్థాయిలో సీటింగ్ సామర్థ్యం పూర్తిగా నిండిపోయినట్లుగా చెబుతున్నారు. మ్యాచ్ ను వీక్షించేందుకు హాజరైన అభిమానుల విషయంలో ఇదో కొత్త రికార్డుగా చెబుతున్నారు.
37వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియంలో 36 వేల మేర నిండినట్లు చెబుతున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం.. సీటింగ్ సామర్థ్యానికి మించిన అభిమానులతో ఉప్పల్ స్టేడియం నిండిపోయినట్లుగా చెబుతున్నారు.
ఉప్పల్ స్టేడియం నిర్మించిన నాటి నుంచి తాజా ఐపీఎల్ మ్యాచ్ కే అత్యధికంగా అభిమానులు హాజరైనట్లుగా అధికారులు చెబుతున్నారు. మ్యాచ్ కు కొన్ని గంటల ముందు నుంచే రోడ్లు మొత్తం క్రీడాభిమానుల వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కార్లు.. ద్విచక్రవాహనాలతో నగరం నుంచి ఉప్పల్ కు వచ్చే అన్నిదారులు నిండిపోయాయి. స్టేడియంలో అయితే..అభిమానుల హడావుడికి అంతే లేదు.
ఉత్సాహంతో వారు చేసే నినాదాలు.. సందడితో ఐపీఎల్ మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. జాతీయ జెండా రంగుల్ని ముఖానికి పెయింటింగ్ వేసుకోవటం.. ఐపీఎల్ జట్ల క్యాప్ లు.. జెండాలు ఊపుతూ అభిమానులు సందడి చేశారు. చాలా రోజుల తర్వాత మెట్రో రైళ్లన్నీ క్రికెట్ అభిమానులతో కిటకిటలాడిపోయాయి.హైదరాబాద్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. సొంత గడ్డ మీద హైదరాబాద్ సన్ రైజర్స్ కు భంగపాటు తప్పలేదు.