ఫేస్ బుక్ కు భారీ జరిమానా

Update: 2018-12-08 10:43 GMT
ములిగే నక్క పై తాటిపండు పడ్డ చందం గా మారింది ఫేస్ బుక్ పరిస్థితి. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం తో ఇప్పటి కే పలు దేశాల్లో ఫేస్ బుక్  జరిమానాలు ఎదుర్కొంటోంది. తాజా గా ఇటలీ కూడా ఫేస్ బుక్ కు భారీ జరిమానా విధిస్తూ గట్టి షాక్ ఇచ్చింది.

యూజర్ల భద్రత చట్టాలను పర్యవేక్షించే కాంపిటిషన్ అథారిటీ ఏజీసీఎం యూజర్లను ఫేస్ బుక్ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపిస్తూ 10మిలియన్ యూరోలు(దాదాపు 80కోట్లకు పైగా) ఇటలీ ప్రభుత్వం జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి డేటాను వాణిజ్య అవసరాలకు వాడుకుటుందని, ఇతర సంస్థలకు విక్రయిస్తుందని ఏజీసీఎం ఆరోపించింది.

ఇందుకు గాను వెంటనే 10 మిలియన్ యూరోలు చెల్లించాలని ఫేస్ బుక్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో కోట్లాది ఫేస్ బుక్ వినియోగదారుల డాటా దుర్వినియోగమైందని, కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థకు వినియోగదారుల సమాచారాన్ని విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలు ఫేస్ బుక్ ఒప్పుకొని క్షమాపణ చెప్పింది. కొన్ని ఆరోపణలను ఖండించింది కూడా.. తాము ఖాతాదారుల డేటాను విక్రయించడం లేదని చెబుతోంది. ఈ ఆరోపణల నేపథ్యం లో ఫేస్ బుక్ సంస్థ  వినియోగాదారుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటుంది. ఫేక్ బుక్ తన వాదనలను ఎలా నిరూపించుకుంటుందో చూడాలి మరీ..

Tags:    

Similar News