ట్రాఫిక్ రూల్స్ పాటించండి .. పాటించండి అని చెప్పే పోలీసులే ఆ ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. ముగ్గుర మహిళా కానిస్టేబుళ్లు ఒకే టూ వీలర్ బండిపై వెళ్తూ.. ఎన్ని ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేశారో చూడండి.. ఒక్క బైక్ మీద ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు అలాంటిది అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేనా మధ్యలో కూర్చున్న ఆమె డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా, అంటే లేదు. తాగి బండి నడిపే వారికి, లైసెన్స్ లేకుండా బండి నడిపే వారికి చివరకు హెల్మెట్ లేని వారికి కూడా ఫైన్స్ వేస్తారు పోలీసులు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో మాస్క్ లేని వారికి కూడా ఫైన్ విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ, ఈ నియమాలు సాధరణ ప్రజలకే కానీ మాకు కాదు అన్నట్టుగా ఈ ముగ్గురు మహిళా పోలీసులు ఎంచెక్కా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైయ్యారు.
ఇక అసలు విషయం ఏంటంటే..ఖమ్మంలోని స్టేషన్ దారిలో ఇలా తప్పు మీద తప్పు నిర్లక్ష్యమై రోడ్డేలుతుంటే ఇలాంటి వారి ప్రాణాలకు ఎలాగూ భద్రతుండదు. మరి ఏ పాపం చేయని అవతలి వారి ప్రాణాలకు భద్రత ఎక్కడుంటుంది. ఇలా వైరల్ గా మారిన ఫొటో పై సీపీ విష్ణు వారియర్ సీరియస్ గా స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుల్ కు బారీ జరిమానా విధించాలని ఆదేశించారు. ఈనెల 9 వ తేదిన షర్మిలా సంకల్ప సభకు హజరైయ్యేందుకు TS04FD0822 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు వెళ్తున్నట్లు నగరంలోని ఆనంద్ విహార్ సెంటర్ వద్ద వున్న సీసీ కెమెరాలలో గుర్తించారు. ఖమ్మం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలసి హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద ట్రాఫిక్ పోలీసులు రూ. 3300/- జరిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్ పై సీరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ బాధ్యతారాహితంగా వ్యవహరించిన ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. వారికి చార్జి మెమోలు జారీ చేశారు.