రష్యాకు భారీ షాక్.. 12వేల మంది సైనికులు హతం?

Update: 2022-03-09 11:10 GMT
ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనతో 12వేల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. రష్యా పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ రష్యా వైపు దాదాపు 12 వేల మంది సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ వెల్లడించారు.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ 12 రోజుల్లో జరిగిన భీకర పోరులో రష్యా వైపు 12వేల సైనికులు మరణించారు. రష్యాకు చెందిన 303  యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ , 48 యుద్ధ విమానాలు, 80 హెలిక్యాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.

అయితే రష్యా మాత్రం ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇప్పటివరకూ తమవైపు 498 మంది సైనికులు మాత్రమే మరణించినట్లు రష్యా తెలిపింది. ఇక రష్యా జరిపే దాడుల్లో ఉక్రెయిన్ లో వేలాది మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. నివాస సముదాయాలపై రష్యా చేస్తోన్న వైమానిక దాడుల్లో నిత్యం వందల మంది పౌరులు మరణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాకథనాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లో పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు సైనిక బలగాలను రాజధాని కీవ్ లోకి ప్రవేశింపచేసింది. రష్యా సైనికులతో ఉక్రెయిన్ బలగాలు పోరాడుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది.  ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మొత్తం 12వేల మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు మట్టుబెట్టాయని ఆ దేశ అధ్యక్ష కార్యాలయ అధికారి పేర్కొన్నారు. మరో 200 మంది రష్యా సైనికులు పట్టుబట్టారని తెలిపారు.

 ఉక్రెయిన్ పై రష్యా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. అనేకప్రాంతాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉక్రెయిన్ దాడిపై స్పందించిన రష్యా.. ఇప్పటివరకూ ఉక్రెయిన్ లోని 118 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.  వాటిలో 11 మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్, 13 కమాండ్ పోస్ట్ లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ సెంటర్లు, 14 ఎస్300, ఓసా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్ కు చెందిన ఐదు యుద్ధవిమానాలు, ఒక హెలిక్యాప్టర్, ఐదు డ్రోన్ లు కూల్చేశామని.. డజన్ల కొద్దీ వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
Tags:    

Similar News