బిచ్చగాడి సొమ్ము రాళ్లపాలంటే ఇదే..

Update: 2019-06-28 05:04 GMT
ఒక బిచ్చగాడు ఒక రోజుకు ఎంత సందిస్తాడు.. అడ్డుక్కునే అతడి సంపాదనో ఏ వందో.. రెండు వందలో ఉంటుంది. చాలా మందికి ఆ రోజు కప్పం రాక పస్తులుండే పరిస్థితులు ఉంటాయి. కానీ బిచ్చగాళ్ల వద్ద కూడా సొమ్ము ఉంటుంది. రోజు అడుక్కునే వాళ్లు ఆ సొమ్మును దాచుకుంటారు కానీ వాడుకోరని చాలా సందర్భాల్లో తేటతెల్లమైంది.

ఇది వరకు చాలా ప్రాంతాల్లో చనిపోయిన బిచ్చగాళ్ల సంచుల్లో దిండుల్లో లక్షలు వెలుగుచూడడం మనకు కనిపించింది. బిచ్చగాడు సినిమాలోనూ బిచ్చగాళ్ల వద్ద లక్షల చిల్లర పోత పోసి హీరోయిన్ ను కాపాడుతారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి.

తాజాగా అనంతపురం జిల్లా పాత గుంతకల్లులో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని దర్గా వద్ద కొన్నేళ్లుగా షేక్ బషీర్ అనే 75 ఏళ్ల బిచ్చగాడు అడుక్కుంటుంటాడు. కదిరి ప్రాంతానికి చెందిన ఈ బిచ్చగాడు 12 ఏళ్ల నుంచి దర్గాలో యాచిస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి ఎవరూ లేరు. సడన్ గా బుధవారం చనిపోయాడు.  దీంతో దర్గా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా ఆచూకీ కోసం ఇతడి సంచి ఓపెన్ చేస్తే ఆశ్చర్యం వెలుగుచూసింది. అందులో కొత్త బట్టలతోపాటు నగదు లభించింది. దర్గా నిర్వాహకుల సమక్షంలో ఆ డబ్బులు లెక్కించగా ఏకంగా 3.23 లక్షలని తేలింది.

ఇతడికి ఎవరూ లేకపోవడంతో ఆ మూడు లక్షల 23వేల నుంచి 13 వేలు తీసి పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మిగత సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. ఇలా రాజుల సొమ్ము రాళ్ల పాలు కావడం అంటే ఇదేనేమో.. మూడు లక్షల సొమ్ము ఉన్నా అతడు ఆ డబ్బులతో తినలేదు. పోనీ తనకు తెలిసిన వాళ్లకు పెట్టలేదు. చివరకు ప్రభుత్వ పరం చేశాడు. బిచ్చగాడిగానే పరమపదించాడు.
Tags:    

Similar News