మందు కోసం ఫైట్.. కంట్రోల్ కావడం లేదే

Update: 2020-08-24 11:50 GMT
ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా.. ఎన్ని కరోనాలు వచ్చినా అన్నీ బంద్ అయిపోతావేమో కానీ.. మద్యం సరఫరా మాత్రం బంద్ కాదు.. షాపులు తెరిస్తే చాలు.. ఆబగా ఎగబడిపోతుంటారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనూ అలానే ఎగబడ్డారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో కొత్తగా ఆర్మీ క్యాంటీన్ వద్ద మద్యం షాపును తెరిచారు. సుధీర్ఘ విరామం తర్వాత తిరిగి మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో భారీ సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరారు.

జనం మద్యం కోసం పోటెత్తడంతో మద్యం బాబులను అదుపు చేసే పనిలో పోలీసులు, స్థానిక వలంటీర్లు తలలు పట్టుకున్నారు.

మద్యం కోసం మద్యం ప్రియులు తపన పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు ఎగబడుతుండడంతో అక్కడ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు.
Tags:    

Similar News