ఏడాదికి పైగా సమయం, 3 వేల పైచిలుకు కిలోమీటర్లు.. కళ్లముందు భారీ లక్ష్యం.. అయినా కూడా ఏమాత్రం వెరవకుండా తన పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేశారు వైసీపీ అధినేత జగన్. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు జగన్.. శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పాదయాత్ర పూర్తైన తర్వాత మళ్లీ కొండకు వస్తానని మొక్కుకున్నారు. అనుకున్న ప్రకారం పాదయాత్ర పూర్తవ్వడంతో.. డైరెక్ట్‌గా ఇచ్చాపురం నుంచే తిరుమల చేరుకున్నారు జగన్.
అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు జగన్. ఈ నడక మార్గంలో జగన్ వస్తున్నారని తెలిసి.. భక్తులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. పాదయాత్రలో ఎలా అయితే ఆయనతో కరచాలనం చేశారో.. ఇప్పుడు కూడా అదే విధంగా జగన్‌తో చేయి కలిపేందుకు జనం పోటీ పడ్డారు. జగన్ కూడా ప్రతీ ఒక్కరిని అప్యాయంగా పలకరించుకుంటూ ఏమాత్రం అలసటం లేకుండా తిరుమల కొండకు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ఉదయం ఇడుపుల పాయ వెళ్తారు. అక్కడ నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు జగన్.
Full View