రాజ‌న్న మాట‌.. జ‌గ‌న్‌ నోట వచ్చిన వేళ‌..!

Update: 2019-05-31 05:12 GMT
రాజ‌న్న మాట‌.. జ‌గ‌న్‌ నోట వచ్చిన వేళ‌..!
  • whatsapp icon
నేను విన్నాను.. నేను చూశాను అంటూ గంభీర‌మైన గొంతుతో యాత్ర మూవీలో వైఎస్ మాట‌ల్ని విన్న‌ప్పుడు ఒళ్లంతా ఒక‌లాంటి కంప‌న రావ‌టం అంద‌రికి అనుభ‌వ‌మే. మ‌న‌సుల్ని నేరుగా తాకే ఆ మాట‌ల్ని తాజాగా త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన‌ప్పుడు.. పెల్లుబికిన భావోద్వేగం అంతా ఇంతా కాదు.

రాజ‌న్న మాట జ‌గ‌న్ నోట నుంచి వ‌చ్చిన వెంట‌నే.. వేలాది మంది నుంచి వ‌చ్చిన స్పంద‌న బెజ‌వాడ ఇందిరాగాంధీ స్టేడియంను మారుమోగిపోయేలా చేసింది. ప్ర‌జ‌ల క‌ష్టాల్ని తాను విన్నాన‌ని.. ప్ర‌జ‌ల బాధ‌ల్ని తాను చూశాన‌ని జ‌గ‌న్ నోట నుంచి మాట రావ‌టం ఆల‌స్యం.. రాజ‌న్న‌ను గుర్తు చేసుకుంటూ.. ప్ర‌జ‌లు హ‌ర్ష‌ధ్వానాలతో త‌మ సంతోషాన్ని ప్ర‌ద‌ర్శించారు.

త‌మ క‌ష్టాల‌కు.. బాధ‌ల‌కు ముగింపు ప‌లికేలా జ‌గ‌న్ పాల‌న ఉంటుంద‌న్న ఆశ‌.. భ‌రోసా వారిలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ముఫ్పై నిమిషాల‌కు పైనే ప్ర‌సంగించిన జ‌గ‌న్ ప్ర‌సంగంలో మూడు అంశాలకు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించాన‌న్న మాట‌కు.. నేను విన్నాను.. నేను చూశాను అన్న మాట‌ల‌తో పాటు.. వైఎస్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన‌ప్పుడు వేలాదిగా విచ్చేసిన ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి.
Tags:    

Similar News