'మ్యాన్ ఈటర్' కడుపులో మహిళ చెవిరింగులు... పోస్టుమార్టంలో కీలక విషయాలు!

వయనాడ్ జిల్లాలో "మ్యాన్ ఈటర్"గా ప్రకటించిన పులి మృతి చెందిన నేపథ్యంలో.. ఆ పులి కళేబారానికి పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు.;

Update: 2025-01-28 04:00 GMT

కేరళలోని వయనాడ్ జిల్లాలో మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళపై పెద్దపులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆమెను చంపేసిన పులి, ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసింది. దీంతో.. ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా.. మహిళపై దాడి చేసిన చంపేసిన పులిని "మ్యాన్ ఈటర్"గా ప్రకటించడం.. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఆ పెద్దపులి కళేబారం కనిపించింది. పిలకావు ప్రాంతంలో పాడుబడిన ఓ ఇంటివెనుక ఆ కళేబారన్ని గుర్తించారు అటవీశాఖ అధికారులు.

ఈ సమయంలో... ఆ పులి శరీరంపై గాయాలు ఉన్నాయని.. వాటి ఆధారంగా మరో క్రూర మృగం దాడిలోనే అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో పులి పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ పోస్టుమార్టంలో మహిళ వస్తువులు పులి కడుపులో బయటపడ్డాయి!

అవును... వయనాడ్ జిల్లాలో "మ్యాన్ ఈటర్"గా ప్రకటించిన పులి మృతి చెందిన నేపథ్యంలో.. ఆ పులి కళేబారానికి పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ సమయంలో ఆ పులి కడుపులో చెవిరింగులు, దుస్తులు, వెంట్రుకలు లభ్యమయ్యాయి. దీంతో.. ఇవి రాధకు సంబంధించినవే అయ్యి ఉంటాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు.

దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. పులి, రాధ అనే మహిళ తల భాగాన్ని తినేసి ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో.. ఒళ్లు జలదరించే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఆ పెద్దపులి ఎలా చనిపోయిందనే విషయంపై మాత్రం స్పష్టమైన కారణం ఇంకా రివీల్ కాలేదని అంటున్నారు.

Tags:    

Similar News