బాహుబలి అమ్మాయి.. బాగా నచ్చావ్ అమ్మీ!

దేశానికి పేరు తెచ్చారు వారిపై ఏకంగా ‘దంగల్’ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.. 2 వేల కోట్లకు పైగా కొల్లగొట్టి దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిపెట్టాయి.;

Update: 2025-03-03 20:30 GMT

అబ్బాయిలే కండలు పెంచాలి.. అమ్మాయిలు సుకుమారంగా ఉండాలన్నది పాత నానుడీ.. అనకాలపల్లి నుంచి అంతరిక్షం దాకా అంతటా అమ్మాయిలు రాజ్యమేలుతున్న ఈ లోకంలో వారిని ఎందులోనూ తక్కువగా చూపడానికి.. చూడడానికి ఆస్కారమే లేదు. అందుకే అందంలోనూ.. అందాన్ని విభిన్నంగా ప్రదర్శించడంలోనూ అమ్మాయిలు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. మగాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా కండలు పెంచగలరని ఎన్నో సార్లు నిరూపించారు. లేడీ వస్తాదులు ఒలంపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. దేశానికి పేరు తెచ్చారు వారిపై ఏకంగా ‘దంగల్’ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.. 2 వేల కోట్లకు పైగా కొల్లగొట్టి దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిపెట్టాయి.

కర్ణాటకకు చెందిన చిత్ర అనే యువతి పెళ్లి కూతురులా ముస్తాబై.. బాహుబలిలా కండలు చూపిస్తూ ఇచ్చిన ఫోజులతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న చిత్ర సంప్రదాయ కంజీవరం చీరను ధరించి, సంపూర్ణ పెళ్లికూతురిలా ముస్తాబై తన కండలను ప్రదర్శిస్తూ కనువిందు చేసింది.

ఆమె బంగారు నగలు ధరించి, సంప్రదాయతను పాటించినప్పటికీ, తన బాడీబిల్డింగ్ పోజులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి దుస్తుల్లోనూ తన ఫిట్‌నెస్‌ ప్రదర్శన కొనసాగించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె కాన్ఫిడెన్స్‌కి, ఫిట్‌నెస్‌పై ఉన్న ప్రేమకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వారంతా చిత్రను అభినందిస్తున్నారు. "పెళ్లి కూతురు స్టైల్లోనూ బాడీబిల్డింగ్ చూపించగల సమర్థత ఉన్న మహిళలకు ఇది గొప్ప ప్రేరణ" అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

చిత్ర లాంటి మహిళలు తమ ఫిట్‌నెస్‌తో, కాన్ఫిడెన్స్‌తో, సాంప్రదాయాన్నీ, ఆధునికతనూ కలిపి సమతుల్యాన్ని చూపించడం విశేషం. ఆమె వీడియో ఇప్పుడు అమ్మాయిలందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది.

Tags:    

Similar News