టీడీపీ మహానాడులో ఏపీ మంత్రి నారా లోకేశ్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. పాలక పార్టీ మంత్రిగా, సీఎం తనయుడిగా, భవిష్యత్ ముఖ్య నేతగా ఆయన ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఆయన ప్రసంగించినప్పుడు కార్యకర్తల్లో ఏమాత్రం జోష్ కనిపించలేదు. వారి నుంచి ఏమాత్రం స్పందన లేదు. ‘తమ్ముళ్లూ ఏమంటారు’ అంటూ ఆయన ప్రసంగం మధ్యలో పదేపదే కదిపినా కూడా కార్యకర్తలు కామ్ గా ఉన్నారే తప్ప ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. అదే సమయంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మాత్రం మహానాడు ప్రాంగణం దద్దరిల్లి పోయింది.
అవినీతి ఆరోపణలపై జగన్ కు లోకేశ్ సవాళ్లు విసిరినా కూడా కార్యకర్తల్లో ఏమాత్రం ఊపు రాలేదు. మరోవైపు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగిస్తారని సభను నడిపిస్తున్న సీతక్క ప్రకటించగానే మహానాడు ప్రాంగణం మారుమోగిపోయింది. సభలో కార్యకర్తలు లేచి తెలంగాణ పులి అంటూ నినాదాలు చేశారు. ఈలలు వేస్తూ, చప్పట్లు కొట్టారు. దీంతో చంద్రబాబు కూడా ఆ రెస్పాన్సు చూసి స్పందించాల్సి వచ్చింది. రేవంత్ ఎంత సేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడనివ్వాలంటూ సూచించినట్లు తెలుస్తోంది.
రేవంత్ మైక్ పట్టుకున్న తరువాత సుమారు మూణ్నాలుగు నిమిషాలు మాట్లాడకుండా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. చప్పట్లు, ఈలల మోత మోగడంతో అవి ఆగే వరకు ఆయన వెయిట్ చేసి ఆ తరువాత మాట్లాడడం మొదలుపెట్టారు. 25 నిమిషాలపాటు రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే మళ్లీ కార్యకర్తల హర్షద్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/