మస్క్‌కు భారీ షాక్‌...రూ.1200కోట్లు దావా , ఎందుకంటే !

Update: 2021-11-17 16:30 GMT
టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ధిక సంస్థ జేపీ మోర్గాన్ ఎలన్‌ మస్క్‌ కు చెందిన టెస్లా పై $162 మిలియన్ల మన దేశ కరెన్సీలో రూ.12,04,86,69,000.00 దావా వేసింది. టెస్లా స్టాక్ వారెంట్‌ లకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ దావాలో వెల్లడించనుంది. ఇందులో భాగంగా మస్క్ ట్వీట్లు షేర్ ధరలు తగ్గేలా ప్రేరేపించాయని ఆరోపణలు చేసింది. మాన్‌ హట్టన్ ఫెడరల్ కోర్టులో జేపీ మోర్గాన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం, మాన్‌ హట్టన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, కన్వర్టిబుల్ నోట్లను జారీ చేయడం ద్వారా దాని స్టాక్స్‌ వ్యాల్యూ తగ‍్గే ప్రమాదాన్ని నివారించడం, ఆదాయపు పన్ను మినహాయింపు పొందేలా 2014లో జేపీ మోర్గాన్ టెస్లా నుండి వారెంట్లను కొనుగోలు చేసింది.

వారెంట్ల గడువు ముగిసినప్పుడు, టెస్లా స్టాక్ నిర్దిష్ట స్ట్రైక్ ధర కంటే ఎక్కువగా ఉంటే జేపీ మోర్గాన్‌కు షేర్లు లేదా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎలన్‌ చేసిన ట్వీట్ల తో టెస్లా స్టాక్‌ ధర, ట్వీట్‌ కు ముందు భారీగా ఉన్న ధర కాస్త తగ్గింది. దీంతో స్టాక్‌ వారెంట్‌లను ఒప్పొందం చేసుకున్న జేపీ మోర్గాన్‌ నష్టపోయింది. ఇదే అంశంపై జేపీ మోర్గాన్ ప్రతినిధులు తాజాగా మాన్‌ హట్టన్‌ కోర్టులో ఎలన్‌ మస్క్‌ తమకు 162 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018, ఆగస్ట్‌ 7న టెస్లా సంస్థ గురించి ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. టెస్లాను ఉద్దేశిస్తూ గోయింగ్ ప్రైవేట్ అంటూ ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ఆ దెబ్బతో టెస్లాతో పాటు, అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు చెందిన కంపెనీల స్టాక్‌ ధర తగ్గింది. మరికొద్ది సేపటికే ఆలోచనను విరమించుకున్నారు. కంపెనీ ఐపీఓకి వెళుతుందని ప్రకటించారు. ఎలన్‌ మస్క్‌ గోయింగ్‌ ప్రైవేట్‌ అంటూ చేసిన ట్వీట్‌ తో తమ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువ జేపీ మోర్గాన్ చేజ్, కో షేర్‌ వ్యాల్యూ భారీగా పడిపోయిందని, దాంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని కోర్ట్‌లో వాదించింది. మస్క్‌ అనాలోచితమైన ట్వీట‍్ల వల్ల తమ కంపెనీ భారీగా నష్టపోయిందని, న్యాయం చేయాలని కోర్టును కోరింది.
Tags:    

Similar News