తెలంగాణ రాష్ట్రంలోకి కొన్ని ఊళ్లల్లో విమానాలు సందడి చేస్తున్నాయి. చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాలతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి. ఇంతకీ అంత తక్కువ ఎత్తులో విమానాలు ఎందుకు ఎగురుతున్నాయి? అన్న క్వశ్చన్ కు ఆశ్చర్యకరమైన సమాధానం వస్తోంది.
తక్కువ ఎత్తులో ఎగురుతున్న మానవ రహిత విమానాలతో భూఅక్రమాల మీద దృష్టి పెట్టారు అధికారులు. దశాబ్దాల తరబడి సాగుతున్న వివాదాలకు చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పద భూముల లెక్క తేల్చటంతో పాటు.. సర్వే నెంబర్లతో పాటు.. వాటి హద్దుల్ని గుర్తించటం.. నీటి నిల్వల్ని గుర్తించటం.. భూ పొరలను.. భూమిపైన ఉన్న మూడు సెంటీమీటర్ల పరిమాణంతో ఉన్న సవ్తువుల్ని కూడా గుర్తించటం ఈ విమానాల ప్రత్యేకత.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూసర్వేలో భాగంగా వివాదాస్పద భూముల లెక్క తేల్చేందుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు.
ప్రభుత్వ భూముల్ని సర్వే చేసేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. జిల్లాలోని తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ శివారులో 50 ఏళ్లుగా వివాదాస్పద భూములు కొన్ని ఉన్నాయి. దాదాపు 620 ఎకరాలకు పైనే ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి వివాదం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో లెక్క తేల్చేందుకు మానవ రహిత విమానాన్ని ప్రయోగించారు. భూమికి 150 అడుగుల ఎత్తులో ఎగిరే ఈ విమానం భూగర్భంలోని నీటి నిల్వల్ని స్కాన్ చేయటంతో పాటు.. సర్వే నెంబరుకు ఎంత భూమి ఉందన్న విషయాన్ని కచ్ఛితంగా గుర్తిస్తుందని చెప్పారు.
గంటకు 500 ఎకరాల్ని సర్వే చేయటంతో పాటు ఫోటోల్ని కూడా తీస్తుంది. 18 భూ పొరల్ని స్కాన్ చేయటంతో పాటుప్రతి అణువును సర్వే చేయటం దీని ప్రత్యేకత. ఈ విమానం సాయంతో భూమి కొలతలు.. సర్వే నెంబరులోని ఉప సంఖ్యల వివరాల్ని కూడా తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. సందడి చేస్తున్న ఈ లెక్కల విమానం గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తికర చర్చకు తెర తీస్తుందని చెప్పకతప్పదు.